Amazon Prime Day Sale 2021 సేల్ మరో రెండు రోజుల్లో మొదలవనుంది. ఈ సేల్ వచ్చే సోమవారం అంటే, జూలై 26 నుండి మొదలవుతుంది. ఈ అప్ కమింగ్ అమెజాన్ సేల్ నుండి ప్రైమ్ మెంబెర్స్ కోసం చాలా ఆఫర్లను తీసుకువస్తోంది. ఈ సేల్ నుండి టీవీలు, వాషింగ్ మెషీన్స్, హోమ్ ఆడియో, స్మార్ట్ ఫోన్స్, గృపకారాణాలు మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన భారీ ఆఫర్లను కస్టమర్లు అందుకోవచ్చు.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరిగే తేదీలలో సాయంత్రం 4 నుండి 6 గంటల వరకూ 'WOW Deals' సేల్ నిర్వహిస్తుంది. ఈ వావ్ డీల్స్ నుండి స్మార్ట్ వాచ్, స్టోరేజ్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ ను సేల్ చేయనునట్లు ప్రకటించింది. అలాగే, అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి 150 రూపాయల వరకూ క్యాష్ బ్యాక్ రివార్డ్ ను కూడా గెలుచుకోవచ్చు.
ఈ అమెజాన్ సేల్ నుండి లేటెస్ట్ మొబైల్స్ మరియు యాక్ససరిస్ పైన 40% వరకూ డిస్కౌంట్ అఫర్ చేస్తున్నట్లు చెబుతోంది. ఇక ఎలక్ట్రానిక్స్ పైనైతే గరిష్టంగా 60 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. అన్నింటికన్నా ఎక్కువగా Home&Kitchen ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా 70% వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు అమెజాన్ చెబుతోంది. ఇక ఇవన్నీ చూస్తుంటే అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఒక వస్తువులను కొనాలని చూస్తున్న వారికీ వరంలా కనిపిస్తుంది.
"అమెజాన్ తన Prime Day సేల్ ని జూలై 26, 2021 నుండి జూలై 27, 2021 వరకూ ప్రకటించింది. ఈ సేల్ ప్రైమ్ మెంబెర్స్ కోసం మాత్రమే నిర్వహిస్తుంది మరియు స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, అమెజాన్ డివైజెస్, హోమ్ అప్లయన్సెస్, గృహోపకరణాలు, ఫ్యాషన్ & amp; బ్యూటీ, హోమ్ & amp; కిచెన్, ఫర్నిచర్ సహా అన్ని కేటగిరీలలో ప్రైమ్ డే అద్భుతమైన డీల్స్ తెస్తుంది."