Amazon Prime Day: ఈరోజు అర్ధరాత్రి నుండి మొదలవుతుంది..!!

HIGHLIGHTS

Amazon Prime Day ఈరోజు అర్ధరాత్రి నుండి మొదలవుతుంది

ఈ అతిపెద్ద సేల్ ఈరోజు మరియు రేపు అంధుబాటులో ఉంటుంది

ఈ సేల్ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది

Amazon Prime Day ఈరోజు అర్ధరాత్రి నుండి మొదలవుతుంది. ఈ అతిపెద్ద సేల్  ఈరోజు మరియు రేపు అంధుబాటులో ఉంటుంది. అమెజాన్ ఈ సేల్ నుండి భారీ డిస్కౌంట్ మరియు ఇతర గొప్ప ఆఫర్లను కూడా అందిస్తుంది. ఈ సేల్ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది మరియు కేవలం Prime Members కోసం మాత్రమే కాబట్టి, మంచి డిస్కౌంట్లతో బ్రాండెడ్ ప్రోడక్ట్ లను మీ సొంతం చేసుకోవచ్చు.

ఈ సేల్ ను అనుసరించి చాలా బ్రాండ్స్ వారి ప్రోడక్ట్స్ ని సైతం విడుదల చేశాయి మరియు ఈ సేల్ నుండి ఆ ప్రోడక్ట్స్ మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తాయి. వీటిలో, Redmi ఫ్లాగ్ షిప్ ఫోన్ K50i తో పాటుగా Samsung ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ Galaxy 13 4G మరియు Galaxy 13 5G, Tecno Spark 9, వంటి మరిన్ని ఫోన్లు వున్నాయి. అంతేకాదు, చాలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు కూడా అమెజాన్ తెలిపింది.

అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి అందించిన బ్యాంక్ అఫర్ వివరాల్లోకి వెళితే, అమెజాన్ ఈ సేల్ ను ICICI మరియు SBI బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకువస్తోంది. తద్వారా, ICICI మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో ప్రోడక్ట్స్ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లాభాలను అందించగలగుతుంది. అంటే, Amazon Prime Day సేల్ నుండి ICICI లేదా SBI బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ లతో వస్తువులను కొనుగోలు చేస్తే వారికి 10% అదనపు తగ్గింపు లభిస్తుంది.

అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి అమెజాన్ బ్రాండ్ ప్రోడక్ట్స్ మరియు టీవీల పైన గరిష్టంగా 70% వరకూ డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే, మొబైల్స్ పైన 40%, టీవీలు మరియు అప్లయన్సెస్ పైన గరిష్టంగా 50% వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు సూచించింది. మంచి ల్యాప్ టాప్ లేదా హెడ్ ఫోన్ కోసం చూస్తున్న వారికి Amazon Prime Day సేల్ మంచి సమయం కావచ్చు. ఎందుకంటే, ఈ సేల్ నుండి ల్యాప్ టాప్ మరియు హెడ్ ఫోన్ వంటి మరిన్ని గ్యాడ్జెట్స్ పైన గరిష్టంగా 75% డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు చెబుతోంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :