Amazon Mega Tablet Premier League offers big deals on Lenovo Tab Plus
అమెజాన్ ప్రకటించిన Mega Tablet Premier League సేల్ ఈరోజు రెండో రోజుకు చేరుకుంది. ఈ సేల్ నుంచి ఈరోజు కూడా బెస్ట్ టాబ్లెట్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఎంటర్టైన్మెంట్ కోసం మంచి టాబ్లెట్ కోసం చూస్తున్న వారి కోసం ఈరోజు బెస్ట్ డీల్ ఒకటి ఈ సేల్ నుంచి అందుబాటులో ఉంది. అమెజాన్ అందించిన ఆఫర్స్ తో ఈ టాబ్లెట్ ను మొబైల్ ఫోన్ రేటుకే అందుకునే అవకాశం అందించింది. అమెజాన్ అందించిన ఈ బెస్ట్ టాబ్లెట్ వివరాలు తెలుసుకుందామా.
అమెజాన్ మెగా ప్రీమియర్ లీగ్ సేల్ రెండో రోజైన ఈరోజు Lenovo Tab Plus పై బెస్ట్ డీల్స్ అందించింది. అమెజాన్ అందించిన ఈ ఆఫర్స్ తో ఈ టాబ్లెట్ మొబైల్ ఫోన్ ధరకే లభిస్తుంది. ఇక ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, ఈ లెనోవో టాబ్లెట్ ని అమెజాన్ ఈరోజు 47% భారీ డిస్కౌంట్ తో రూ. 16,999 రూపాయల ఆఫర్ ధరకు సేల్ చేస్తోంది.
ఈ ఆఫర్ తో పాటు ఈ టాబ్లెట్ పై మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందిస్తుంది. ఈ టాబ్లెట్ ను అమెజాన్ సేల్ నుంచి ఈరోజు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టాబ్లెట్ కేవలం రూ. 15,749 ఆఫర్ ధరకే లభిస్తుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సాధారణ మొబైల్ రేటుకే లభిస్తుంది. ఈ ధరలో ఈ టాబ్లెట్ ఎటువంటి ఫీచర్స్ అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా. Buy From Here
Also Read : Realme Buds Air 7 Pro : సెగ్మెంట్ ఫస్ట్ AI ట్రాన్స్ లెటర్ ఫీచర్ కలిగిన బడ్స్ గా వస్తోంది.!
ఈ లెనోవో టాబ్లెట్ ఎంటర్టైన్మెంట్ కోసం సరైన ఎంపిక అవుతుంది. ఎందుకంటే, ఈ టాబ్లెట్ 8 JBL స్పీకర్లు మరియు పవర్ ఫుల్ 2K డిస్ప్లే తో వస్తుంది. క్లియర్ గా చెప్పాలంటే, ఈ టాబ్లెట్ 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి 11.2 ఇంచ్ 2K రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ 4 ఉఫర్స్ మరియు 4 ట్వీటర్స్ తో మొత్తం 8 స్పీకర్లు కలిగి జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. టాబ్లెట్ Hi-Res Audio మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇది మీరు చూసే కంటెంట్ ను గొప్ప సౌండ్ తో ఆస్వాదించేలా సహాయం పడుతుంది.
ఈ టాబ్లెట్ బిల్ట్ ఇన్ కిక్ స్టాండ్ తో కూడా వస్తుంది. అంటే, ఈ టాబ్లెట్ ను కావాల్సిన విధంగా నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది కేవలం Wi-Fi పై మాత్రమే పని చేసే టాబ్లెట్ మరియు Mediatek Helio G99 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఈ టాబ్లెట్ 8GB ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ 8600 mAh బిగ్ బ్యాటరీ మరియు టైప్ C పోర్ట్ ద్వారా 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 8 MP రియర్ మరియు 8 MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ లెనోవో టాబ్లెట్ IP52 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 14 OS తో పని చేస్తుంది మరియు ఆండ్రాయిడ్ 16 వరకు అప్డేట్ అందుకుంటుంది.