భారీ ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేసింది

HIGHLIGHTS

అమెజాన్ కొత్త సంవత్సరంలో తన మొదటి సేల్ ప్రకటించింది

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17 నుండి స్టార్ట్ అవుతుంది

ప్రైమ్ మెంబర్స్ కు ఒకరోజు ముందుగానే యాక్సెస్ అందుతుంది

భారీ ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేసింది

అమెజాన్ కొత్త సంవత్సరంలో తన మొదటి సేల్ ప్రకటించింది. అదే, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ మరియు ఈ సేల్ ను భారీ డీల్స్ తో కూడా ప్రకటించింది. ఈ అమెజాన్ అప్ కమింగ్ సేల్ నుండి మంచి డిస్కౌంట్, బ్యాంక్ అఫర్లు మరియు మరిన్ని డీల్స్ అందుకోవచ్చు. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17వ తేది అర్ధ రాత్రి 12 గంటలకు మొదలవుతుంది మరియు జనవరి 20వ తేది అర్ధ రాత్రి 12 గంటలకు ముగుస్తుంది. అలాగే, ఎప్పటిలాగానే ప్రైమ్ మెంబర్స్ కు ఒకరోజు ముందుగానే ఈ అమెజాన్ సేల్ కోసం యాక్సెస్ అందుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon Great Republic Day Sale

అమెజాన్ ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సేల్ ని SBI భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది మరియు ఈ సేల్ నుండి SBI  బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు ద్వారా వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులకు 10% అధనపు డిస్కౌంట్ అఫర్ ను కూడా ప్రకటించింది. అలాగే, అమెజాన్ కూపన్స్, రివార్డ్స్ ఫెస్టివల్ వంటి మరిన్ని లాభదాయకమైన ఆఫర్లను కూడా ప్రకటించింది.

ప్రతి సంవత్సరం కూడా అమెజాన్ రిపబ్లిక్ డే సమయంలో ఈ అమ్మకాన్ని ప్రారంభిస్తుంది. ఈ సేల్ నుండి మొబైల్ ఫోన్స్ పైన భారీ డీల్స్ ని అందిస్తుంది. అలాగే, హెడ్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా 70% వరకు తగ్గింపు ఈ సేల్ నుండి అందిస్తున్నట్లు ఇప్పటికే టీజింగ్ మొదలుపెట్టింది. అదనంగా, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్, No Cost EMI మరియు మరిన్ని లాభాలను కూడా అందిస్తుంది.

ముఖ్యంగా, కొత్త సంవత్సరంలో కొత్త టీవీ లేదా వాషింగ్ మెషిన్ వంటి వస్తువులను కొనాలని చూస్తున్న వారికి ఈ సేల్ సరైన సమయం కావచ్చు. ఎందుకంటే, టీవీలు మరియు వాషింగ్ మెషిన్,ఫ్రిడ్జ్ వంటి లార్జ్ అప్లయన్సెస్ పైన 50% వరకూ భారీ డిస్కౌంట్ ఆఫర్ల చేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది.          

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo