అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్: మొబైల్స్ మరియు టీవీల పైన భారీ ఆఫర్లు తెస్తోంది
అమెజాన్ తన మొదటి సేల్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ను ప్రకటించింది
ఈ అతిపెద్ద సేల్ జనవరి 17 నుండి జనవరి 20 వరకు నిర్వహించబడుతుంది
ప్రైమ్ మెంబర్స్ కోసం ఒకరోజు ముందుగానే సేల్ యాక్సెస్ అందిస్తుంది
జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ తన మొదటి సేల్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ను ప్రకటించింది. ఈ అతిపెద్ద సేల్ జనవరి 17 నుండి జనవరి 20 వరకు నిర్వహించబడుతుంది. అంతేకాదు, ప్రైమ్ మెంబర్స్ కోసం ఒకరోజు ముందుగానే సేల్ కోసం యాక్సెస్ అందిస్తుంది. అంటే, Amazon Great Republic Day Sale 2022 డీల్స్ మరియు ఆఫర్స్ Amazon Prime సభ్యులకు ఒకరోజు ముందుగానే అందుబాటులో ఉంటాయి.
Surveyఅమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు
అమెజాన్ ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2022 ను SBI భాగస్వామ్యంతో తీసుకొచ్చింది మరియు SBI క్రెడిట్ కార్డ్‌ల పైన 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఇది మాత్రమే కాదు, అమెజాన్ నో-కాస్ట్ EMI మరియు క్యాష్‌బ్యాక్‌ను కూడా అందించే అవకాశం ఉంది.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ బెస్ట్ డీల్స్
ఇప్పటికే చేస్తున్న టీజింగ్ మరియు మరిన్ని అంచనాల ప్రకారం, బడ్జెట్ విభాగాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ ఫోన్ల పైన బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్ లతో సహా మొబైల్స్ మరియు యాక్సెసరీలపై 40% వరకు తగ్గింపును అందజేయనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. అలాగే, ల్యాప్ టాప్స్ పైన గరిష్టంగా 40,000 వరకూ భారీ డిస్కౌంట్, టీవీల పైన 50% వరకూ డిస్కౌంట్ మరియు హెడ్‌ఫోన్‌లపై 75% వంటి చాలా డీల్స్ మరియు ఆఫర్లను ఇవ్వనున్నట్లు చెబుతోంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile