అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి Xiaomi 12 Pro పైన బెస్ట్ డీల్స్ పొందవచ్చు.!

HIGHLIGHTS

అమెజాన్ అప్ కమింగ్ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్

Xiaomi 12 Pro పైన బిగ్ డీల్స్ అఫర్ చేయనున్నట్లు అమెజాన్ టీజింగ్ చేస్తోంది

ఈ ఫోన్ ను ప్రస్తుతం కూడా భారీ ఆఫర్లతోనే అమెజాన్ సేల్ చేస్తోంది

అమెజాన్ అప్ కమింగ్ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి Xiaomi 12 Pro పైన బిగ్ డీల్స్ అఫర్ చేయనున్నట్లు అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ పైన గొప్ప డీల్స్ తో పాటుగా మరిన్ని ఆఫర్లను ఈ ఫోన్ పైన అమెజాన్ సేల్ నుండి పొందేవీలుంది. వాస్తవానికి, ఈ ఫోన్ ను ప్రస్తుతం కూడా భారీ ఆఫర్లతోనే అమెజాన్ సేల్ చేస్తోంది. ఈ ఫోన్ పైన రూ.10,000 తగ్గింపు పొందే ఛాన్స్ ఇప్పుడు కూడా కూడా మీకు అందుబాటులో వుంది. అమెజాన్ నుండి ఈ ఫోన్ ఈరోజు 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ కూపన్ తో పాటుగా 6,000 రూపాయల తగ్గింపు అందించే భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా కలిగి వుంది. ఈ ఆఫర్లు మరియు ఫోన్ ప్రత్యేకతల కోసం క్రింద చూడవచ్చు.  

Xiaomi 12 Pro: ధర

షియోమీ 12 ప్రో యొక్క బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ. 62,000 ధరతో వచ్చింది. ఈ ఫోన్ పైన 5,000 రూపాయల కూపన్ అఫర్ ను ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్/ డెబిట్ కార్డ్ మరియు EMI అప్షన్ తో కొనేవారికి గరిష్టంగా 6,000 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Xiaomi 12 Pro: స్పెక్స్

షియోమి 12 ప్రో ఒక ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ యొక్క ఫీచర్లను కూడా ప్రీమియం గానే అందించింది. ఈ ఫోన్ 10-bit 6.73-అంగుళాల 2K+ (3200×1440 పిక్సెల్స్) రిజల్యూషన్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ తో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్‌ మరియు 480Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ప్రీమియం డిస్ప్లే మరింత పటిష్టంగా ఉంచేలా గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో ఈ డిస్ప్లే ని అందించింది.

ఈ ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 8 Gen1 SoC తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ LPDDR5 12GB RAM మరియు UFS 3.1 256GB వరకు స్టోరేజ్ ఎంపికతో జత చేయబడింది మరియు MIUI 13 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ లో OIS తో 50MP (IMX707) కెమెరా జతగా 50MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమెరాతో 24fps వద్ద 8K వీడియోలను, 60fps వద్ద 8K వీడియోలను చిత్రీకరించవచ్చు. అలాగే, సెల్ఫీల కోసం  ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాతో HDR 10+ వీడియోలను చిత్రీకరించవచ్చు

Xiaomi 12 Pro స్టీరియో స్పీకర్‌ లను కూడా కలిగి ఉంది మరియు 4,600mAh బ్యాటరీని భారీ 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో ఈ ఫోన్ లో అందించింది. అంతేకాదు, 10W రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది.  ఈ ఫోన్ కౌటర్ బ్లూ, నోయిర్ బ్లాక్ మరియు ఒపేరా మౌవే అనే మూడు విలక్షణమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :