అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ Pre-Book అఫర్ ద్వారా ప్రోడక్ట్స్ ముందే బుక్ చేసుకోండి.!

HIGHLIGHTS

అమెజాన్ ఎప్పటిలాగానే తన అతిపెద్ద సేల్ అయిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను తీసుకువచ్చింది

అనేకమైన ప్రోడక్ట్స్ ను గొప్ప డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో కొనుగోలు చేసే అవకాశం అందిస్తుంది

కస్టమర్లకు నచ్చిన ప్రోడక్ట్స్ ను ముందుగానే బుక్ చేసుకునే Pre-Book అఫర్ ను అమెజాన్ అందించింది

2022 సంవత్సరం పండుగ సీజన్ కోసం అమెజాన్ ఎప్పటిలాగానే తన అతిపెద్ద సేల్ అయిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను తీసుకువచ్చింది. ఈ సేల్ నుండి అనేకమైన ప్రోడక్ట్స్ ను గొప్ప డిస్కౌంట్  మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో కొనుగోలు చేసే అవకాశం అందిస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23 నుండి మొదలువుతుంది. అయితే, ఎప్పటిలాగే ప్రైమ్ సభ్యులు అందరి కంటే ఒక అడుగు ముందే ఉంటారు. అంటే, ప్రైమ్ సభ్యులు ఒకరోజు ముందుగానే ఈ సేల్ కోసం యాక్సెస్ పొందుతారు.     

ఈ సేల్ మొదలవ్వడానికి ఇంకా రెండు రోజులు ఉన్నా కానీ కస్టమర్లకు నచ్చిన ప్రోడక్ట్స్ ను ముందుగానే బుక్ చేసుకునే Pre-Book అఫర్ ను అమెజాన్ అందించింది. ఈ Pre-Book ద్వారా మీకు నచ్చిన ప్రోడక్ట్ ను కేవలం 1 రూపాయి చెల్లించి సేల్ కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. అంటే, మీకు నచ్చిన ప్రోడక్ట్ ను ఇప్పడు బుక్ చేసుకొని సేల్ నుండి ఆఫర్ ధరకే కొనుగులుచేసుకోవచ్చు. అయితే, అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా ప్రీపెయిడ్ చెల్లింపు ద్వారా మాత్రమే ప్రోడక్ట్స్ ను  ప్రీ-బుకింగ్ చేయవచ్చని మాత్రం గుర్తుంచుకోండి. అమెజాన్ అందించిన ఈ Pre-Book అఫర్ కేవలం సెప్టెంబర్ 21 వ తేదీ వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. Check Offers Here

అమెజాన్ ఇప్పటికే కిక్ స్టార్టర్ సేల్ ద్వారా చాలా ప్రోడక్ట్స్ ను భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. అలాగే, SBI బ్యాంక్ కార్డ్స్ ద్వారా ప్రోడక్ట్స్ ను కొనేవారు 10% అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఎప్పటిలాగానే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం ప్రైమ్ మెంబర్స్ కు ఒకరోజు ముందుగానే యాక్సెస్ అందిస్తుంది. అంటే, సెప్టెంబర్ 22 నుండే ప్రైమ్ మెంబర్స్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను ఆనందించవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :