భారీ ఆఫర్స్ తో Amazon Great Indian Festival Sale డేట్ అనౌన్స్ చేసిన అమెజాన్.!
అమెజాన్ అతిపెద్ద సేల్ Amazon Great Indian Festival Sale డేట్ ను ఈరోజు అనౌన్స్ చేసింది
ఈ సేల్ నుంచి ఆఫర్ చేయబోతున్న బిగ్ డీల్స్ ను కూడా టీజింగ్ చేస్తోంది
ఈ సేల్ నుంచి ఆఫర్ చేయబోతున్న బెస్ట్ డీల్స్ పై ఒక లుక్కేద్దాం పదండి
గత కొంత కాలంగా అమెజాన్ టీజింగ్ చేస్తున్న అమెజాన్ అతిపెద్ద సేల్ Amazon Great Indian Festival Sale డేట్ ను ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ సేల్ డేట్ అనౌన్స్ తో పాటు ఈ సేల్ నుంచి ఆఫర్ చేయబోతున్న బిగ్ డీల్స్ ను కూడా టీజింగ్ చేస్తోంది. అమెజాన్ అప్ కమింగ్ సేల్ డేట్ మరియు ఈ సేల్ నుంచి ఆఫర్ చేయబోతున్న బెస్ట్ డీల్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.
SurveyAmazon Great Indian Festival Sale ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం అవుతుందని అమెజాన్ డేట్ అనౌన్స్ చేసింది. అలాగే, ఒక రోజు ముందుగానే ఈ సేల్ అర్లీ యాక్సెస్ Prime Members కి అందుతుందని కూడా ప్రకటించింది. అంటే, సెప్టెంబర్ 26 వ తేదీ నుంచి ఈ అమెజాన్ సేల్ యాక్సెస్ ప్రైమ్ మెంబర్ లకు అందుతుంది.
Amazon Great Indian Festival Sale నుంచి ఎలాంటి డీల్స్ అందిస్తుంది?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఆఫర్ చేయనున్న ప్రధాన డీల్స్ ను అమెజాన్ ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి ప్రధానంగా స్మార్ట్ టీవీలు మరియు స్మార్ట్ ఫోన్స్ పై భారీ డీల్స్ అందించే అవకాశం వుంది. అమెజాన్ సేల్ టీజర్ పేజి నుంచి ఈ సేల్ బిగ్ డీల్స్ ను కూడా టీజ్ చేస్తోంది. ఈ సేల్ నుంచి స్మార్ట్ టీవీల పై గరిష్టంగా 65% వరకు డిస్కౌంట్ అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, బిగ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఆఫర్ ప్రైస్ తో టీజింగ్ చేస్తోంది.

ఇక స్మార్ట్ ఫోన్ ల విషయానికి వస్తే, ఈ సేల్ నుంచి iPhone 13 పై గొప్ప డిస్కౌంట్ అందించే అవకాశం వుంది. ఈ ఫోన్ ను చవక రేటుకు ఆఫర్ చేసే అవకాశం ఉందని లీక్ స్టర్స్ ఇప్పటికే రూమర్స్ మరియు ఎక్స్ పెక్ట్ ప్రైస్ వివరాలు కూడా లీక్ చేశారు.
Also Read: OnePlus Nord Buds 3 రేపు లాంచ్ అవుతుంది: ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!
ఇక మరిన్ని డీల్స్ విషయానికి వస్తే, ఒక ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్ డీల్ గురించి అమెజాన్ ప్రత్యేకంగా టీజింగ్ చేస్తోంది. ఈ డీల్ ను ‘King Of All Deals’ పేరుతో టీజింగ్ చేస్తోంది. అయితే, ఆ స్మార్ట్ ఫోన్ ఏమిటో ఆ ఫోన్ డీల్ ఏమిటో మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. కానీ, ఈ అప్ కమింగ్ సేల్ నుంచి సౌండ్ బార్స్, స్మార్ట్ వాచ్, కెమెరా, ల్యాప్ టాప్స్ మరియు మరిన్ని ప్రొడక్ట్స్ పైన గొప్ప డీల్స్ అందుకోవచ్చని అమెజాన్ టీజ్ చేస్తోంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile