సంవత్సరానికి ఒక్కసారి వచ్చే అమెజాన్ ధమాకా సేల్ వస్తోంది. అదే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్. సంవత్సరానికి ఒకసారి అమెజాన్ అందించే ఈ అతిపెద్ద ఫెస్టివల్ సేల్ నుండి అనేకమైన వస్తువుల పైన భారీ డీల్స్ అందిస్తుంది. ఈ సేల్ డేట్ ఇంకా ప్రకటించనప్పటికీ ఈ సేల్ అతిత్వరలోనే మొదలవుతుందని ప్రకటించింది. అమెజాన్ ఇండియా ఆన్లైన్ ప్లాట్ఫారం ప్రధాన పేజ్ బ్యానర్ ద్వారా ఈ సేల్ గురించి టీజ్ చేస్తోంది. ప్రైమ్ మెంబెర్స్ కి ఒకరోజు ముందే ఈ సేల్ కోసం యాక్సెస్ అందుతుంది.
ఈ పండుగ సేల్ ని HDFC భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది మరియు ఈ సేల్ నుండి HDFC బ్యాంక్ యొక్క క్రెడిట్, డెబిట్ కార్డు లేదా EMI ద్వారా వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులకు 10% అధనపు డిస్కౌంట్ అఫర్ ను కూడా ప్రకటించింది.
ప్రతి సంవత్సరం కూడా అమెజాన్ పండుగ సమయంలో ఈ అమ్మకాన్ని ప్రారంభిస్తుంది. ల్యాప్ టాప్స్, హెడ్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా 70% వరకు తగ్గింపు ఈ సేల్ నుండి అందిస్తున్నట్లు ఇప్పటికే టీజింగ్ మొదలుపెట్టింది. అదనంగా, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్, No Cost EMI మరియు కూపన్స్ వంటి మరిన్ని లాభాలను కూడా అందిస్తుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి లేటెస్ట్ మొబైల్ ఫోన్స్, టీవీలు మరియు ఆడియో ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ ను ఆశించవచ్చు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఎలక్ట్రానిక్స్ పైన మరిన్ని ఆఫర్లను అందించే అవకాశం వుంది.