జబర్దస్త్ ఆఫర్లతో వస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్ ..!

HIGHLIGHTS

ఈ సంవత్సరం పండుగ సీజన్ కోసం తన అతిపెద్ద సేల్ ను ప్రకటించిన అమెజాన్

జబర్దస్త్ ఆఫర్లతో వస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్

ఈ సేల్ నుండి చాలా ప్రోడక్ట్ లను గొప్ప డిస్కౌంట్ ధరలతో అఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది

జబర్దస్త్ ఆఫర్లతో వస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్ ..!

జబర్దస్త్ ఆఫర్లతో వస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్. ఈ సంవత్సరం పండుగ సీజన్ కోసం తన అతిపెద్ద సేల్ ను ప్రకటించిన అమెజాన్, ఈ సేల్ నుండి భారీ ఆఫర్లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అందించిన వివరాలు మరియు టీజింగ్ ద్వారా, ఈ సేల్ నుండి చాలా ప్రోడక్ట్ లను గొప్ప డిస్కౌంట్ ధరలతో అఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్  సెప్టెంబర్ 23 నుండి మొదలవుతుంది. అయితే, Prime Members కు ఒకరోజు ముందుగా, అంటే సెప్టెంబర్ 22 నుండే యాక్సెస్ అందుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇక అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్ నుండి ఏ ప్రోడక్ట్స్ పైన ఎటువంటి ఆఫర్లను అందించనున్నదో పరిశీలిస్తే, అమెజాన్ ఈ సేల్ కోసం అందించిన మైక్రో సైట్ పేజ్ ద్వారా అందించిన వివరాల ప్రకారం, చాలా మొబైల్ ఫోన్ల పైన గొప్ప డీల్స్ ఇవ్వనున్నట్లు చెబుతోంది. ఇక ఐఫోన్ 12 పైన బిగ్ డీల్ ను అఫర్ చేయబోతున్నట్లు అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఇందులో, ఐఫోన్ 12 ను 3X,XXX అఫర్ ధరతో చూపిస్తోంది. అంటే, ఈ సేల్ నుండి యాపిల్ ఐఫోన్ 12 ను ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే పొందే అవకాశం ఉండవచ్చేమో. Check Offers Here

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ని SBI బ్యాంక్ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది మరియు ఈ సేల్ నుండి SBI బ్యాంక్ యొక్క క్రెడిట్, డెబిట్ కార్డు లేదా EMI ద్వారా వస్తువులను కొనుగోలు చేసే కొనుగోలుదారులకు 10% అధనపు డిస్కౌంట్ అఫర్ ను జతచేసింది. గత సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా ల్యాప్ టాప్స్, హెడ్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా 70% వరకు తగ్గింపు ఈ సేల్ నుండి అందిస్తున్నట్లు ఇప్పటికే టీజింగ్ మొదలుపెట్టింది. అదనంగా, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్, No Cost EMI మరియు కూపన్స్ వంటి మరిన్ని లాభాలను కూడా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo