17 OTT లకు సబ్ స్క్రిప్షన్ అఫర్ చేస్తున్న ఎయిర్టెల్ .. ఏ ప్లాన్ తో అంటే..!!

HIGHLIGHTS

ఎయిర్టెల్ తన కొత్త ప్లాన్ లతో 17 OTT లకు సబ్ స్క్రిప్షన్ అఫర్ చేస్తోంది

ఈ ప్లాన్స్ అధిక డేటాని కూడా అఫర్ చేస్తాయి

Netflix, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్ని + హాట్ స్టార్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది

17 OTT లకు సబ్ స్క్రిప్షన్ అఫర్ చేస్తున్న ఎయిర్టెల్ .. ఏ ప్లాన్ తో అంటే..!!

ఎయిర్టెల్ తన కొత్త ప్లాన్ లతో 17 OTT లకు సబ్ స్క్రిప్షన్ అఫర్ చేస్తోంది. అవే, ఎయిర్టెల్ కొత్తగా ప్రకటించిన  All-In-One బ్రాండ్ బ్యాండ్ ప్లాన్స్. ఈ విభాగంలో మూడు కొత్త ప్లాన్ లను తీసుకువచ్చింది. రూ.699, రూ.1099 మరియు రూ.1599 రూపాయల ధరలతో ఈ ప్లాన్ లను అందించింది. ఈ ప్లాన్స్ కేవలం OTT సబ్ స్క్రిప్షన్ మాత్రమే కాకుండా అధిక డేటాని కూడా అఫర్ చేస్తాయి. ఎయిర్టెల్ యొక్క ఈ కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ వివరాలు తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Airtel Rs.1,599 Plan:

ఈ ప్లాన్ రూ. 1498 రూపాయల ప్లాన్ ను పోలి ఉంటుంది. ఈ ప్లాన్ తో మీరు లేటెస్ట్ Airtel 4K Xstream Box ను అందుకోవడమే కాకుండా 350 చానళ్లను చూడగలిగే ప్రయోజనాన్ని కూడా పొందుతారు. అయితే, ఈ 4K బాక్స్ కోసం 2000 రూపాయల మొత్తాన్ని ఒక్కసారి కట్టవలసి ఉంటుంది. కానీ, ఈ బాక్స్ తో మీరు OTT ఆనందాన్ని మరియు TV ఛానళ్లను కూడా ఆనందించవచ్చు. ఈ ప్లాన్ 300 Mbps స్పీడ్ తో అన్లిమిటెడ్ (3333GB*) డేటాని అఫర్ చేస్తుంది. అంతేకాదు, Netflix, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్ని + హాట్ స్టార్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. 

అధనంగా, ఈ క్రింద తెలిపిన 14 ప్రముఖ OTT ఛానల్స్ కి కూడా ఉచిత యాక్సెస్ అంధిస్తుంది.

ErosNow, SonyLIV, Hoichoi, Lionsgate Play, Shemaroo, ManoramaMax, HungamaPlay, Ultra, DivoTV, EPICon, Klikk, Dollywood, Nammaflix మరియు Shorts TVతో సహా 14 OTT ప్లాట్‌ఫారమ్‌ల కోసం Airtel Xtreme Premium సింగిల్ లాగిన్‌ను పొందుతారు.

Airtel Rs.1,099 Plan:

ఈ ప్లాన్ 200 Mbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని అఫర్ చేస్తుంది. అంతేకాదు, Prime Video మరియు Disney+ HotStar లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో మీరు లేటెస్ట్ Airtel 4K Xstream Box ను అందుకోవడమే కాకుండా 350 చానళ్లను చూడగలిగే ప్రయోజనాన్ని కూడా పొందుతారు. అయితే, ఈ 4K బాక్స్ కోసం 2000 రూపాయల మొత్తాన్ని ఒక్కసారి కట్టవలసి ఉంటుంది. కానీ, ఈ బాక్స్ తో మీరు OTT ఆనందాన్ని మరియు TV ఛానళ్లను కూడా ఆనందించవచ్చు. అలాగే పైన తెలిపిన 14 ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్స్ కు ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది.

Airtel Rs.699 Plan:

ఈ ప్లాన్ కేవలం 40 Mbps స్పీడ్ తో 3333GB డేటాని అఫర్ చేస్తుంది. అంతేకాదు, Disney+ HotStar కు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో మీరు లేటెస్ట్ Airtel 4K Xstream Box ను అందుకోవడమే కాకుండా 350 చానళ్లను చూడగలిగే ప్రయోజనాన్ని కూడా పొందుతారు. అయితే, ఈ 4K బాక్స్ కోసం 2000 రూపాయల మొత్తాన్ని ఒక్కసారి కట్టవలసి ఉంటుంది. కానీ, ఈ బాక్స్ తో మీరు OTT ఆనందాన్ని మరియు TV ఛానళ్లను కూడా ఆనందించవచ్చు. అలాగే పైన తెలిపిన 14 ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్స్ కు ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది.

Airtel యొక్క మరిన్నిప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo