అదిరే అఫర్ తెచ్చిన ఎయిర్టెల్ .. ఏకంగా 17 OTT యాప్స్ కి యాక్సెస్..!!

HIGHLIGHTS

మార్కెట్లోకి ఎయిర్టెల్ అదిరిపోయే అఫర్ తీసుకొచ్చింది

ఈ ప్లాన్ లతో కస్టమర్లకు భారీ ప్రయోజాలను అందచేసింది

ఈ అఫర్ తో 17 OTT యాప్స్ కి యాక్సెస్ అందుతుంది

అదిరే అఫర్ తెచ్చిన ఎయిర్టెల్ .. ఏకంగా 17 OTT యాప్స్ కి యాక్సెస్..!!

మార్కెట్లోకి ఎయిర్టెల్ అదిరిపోయే అఫర్ తీసుకొచ్చింది. అయితే, అఫర్ టెలికం కస్టమర్ల కోసం కాదు, బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు మాత్రమే. ఎయిర్టెల్ కొత్త All-In-One బ్రాండ్ బ్యాండ్ ప్లాన్ లను Airtel Xstream Fiber తో విడుదల చేసింది. ఈ ప్లాన్ లతో కస్టమర్లకు భారీ ప్రయోజాలను అందచేసింది. ఎందుకంటే, ఈ మూడు ప్లాన్స్ కూడా 14 నుండి 17 ప్రముఖ OTT ప్లాట్ ఫారమ్ లకు యాక్సెస్ తీసుకువస్తాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అంతేకాదు, ప్లాన్ లను కేవలం రూ.699 ప్రారంభ ధరతో ప్రకటించింది. ఎయిర్టెల్ మొత్తం మూడు All-In-One బ్రాండ్ బ్యాండ్ ప్లాన్ లను తీసుకువచ్చింది. వీటిలో మిగిలిన రెండు ప్లాన్స్ రూ.1099 మరియు రూ.1599 ధరలతో ఎయిర్టెల్ ప్రవేశపెట్టింది. మరి ఈ మూడు కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ మరియు వాటి వివరాలు ఏమిటో చూద్దామా.

Airtel Rs.1,599 Plan:

ఈ ప్లాన్ రూ. 1498 రూపాయల ప్లాన్ ను పోలి ఉంటుంది. ఈ ప్లాన్ తో మీరు లేటెస్ట్ Airtel 4K Xstream Box ను అందుకోవడమే కాకుండా 350 చానళ్లను చూడగలిగే ప్రయోజనాన్ని కూడా పొందుతారు. అయితే, ఈ 4K బాక్స్ కోసం 2000 రూపాయల మొత్తాన్ని ఒక్కసారి కట్టవలసి ఉంటుంది. కానీ, ఈ బాక్స్ తో మీరు OTT ఆనందాన్ని మరియు TV ఛానళ్లను కూడా ఆనందించవచ్చు. ఈ ప్లాన్ 300 Mbps స్పీడ్ తో అన్లిమిటెడ్ (3333GB*) డేటాని అఫర్ చేస్తుంది. అంతేకాదు, Netflix, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్ని + హాట్ స్టార్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.  

అధనంగా, ఈ క్రింద తెలిపిన 14 ప్రముఖ OTT ఛానల్స్ కి కూడా ఉచిత యాక్సెస్ అంధిస్తుంది.

Airtel Xtream premium.jpg

ErosNow, SonyLIV, Hoichoi, Lionsgate Play, Shemaroo, ManoramaMax, HungamaPlay, Ultra, DivoTV, EPICon, Klikk, Dollywood, Nammaflix మరియు Shorts TVతో సహా 14 OTT ప్లాట్‌ఫారమ్‌ల కోసం Airtel Xtreme Premium సింగిల్ లాగిన్‌ను పొందుతారు.

Airtel Rs.1,099 Plan:

ఈ ప్లాన్ 200 Mbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని అఫర్ చేస్తుంది. అంతేకాదు, Prime Video మరియు Disney+ HotStar లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో మీరు లేటెస్ట్ Airtel 4K Xstream Box ను అందుకోవడమే కాకుండా 350 చానళ్లను చూడగలిగే ప్రయోజనాన్ని కూడా పొందుతారు. అయితే, ఈ 4K బాక్స్ కోసం 2000 రూపాయల మొత్తాన్ని ఒక్కసారి కట్టవలసి ఉంటుంది. కానీ, ఈ బాక్స్ తో మీరు OTT ఆనందాన్ని మరియు TV ఛానళ్లను కూడా ఆనందించవచ్చు. అలాగే పైన తెలిపిన 14 ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్స్ కు ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది.               

Airtel Rs.699 Plan:

ఈ ప్లాన్ కేవలం 40 Mbps స్పీడ్ తో 3333GB డేటాని అఫర్ చేస్తుంది. అంతేకాదు, Disney+ HotStar కు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో మీరు లేటెస్ట్ Airtel 4K Xstream Box ను అందుకోవడమే కాకుండా 350 చానళ్లను చూడగలిగే ప్రయోజనాన్ని కూడా పొందుతారు. అయితే, ఈ 4K బాక్స్ కోసం 2000 రూపాయల మొత్తాన్ని ఒక్కసారి కట్టవలసి ఉంటుంది. కానీ, ఈ బాక్స్ తో మీరు OTT ఆనందాన్ని మరియు TV ఛానళ్లను కూడా ఆనందించవచ్చు. అలాగే పైన తెలిపిన 14 ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్స్ కు ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది.

Airtel యొక్క మరిన్నిప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo