Ai Summit 2026: ఏఐ సమ్మిట్ లో అందరినీ ఆకర్షించిన ముఖ్యాంశాలు ఇవే.!

Updated on 16-Feb-2026
HIGHLIGHTS

విస్తృతంగా పెరుగుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్

AI ని మరింత సురక్షితంగా మలిచే ప్రక్రియలో భాగంగా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ను భారత్ నిర్వహించింది

ఈ సార్వత్రిక AI సమ్మిట్ 2026 ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యమైన ఒక పెద్ద సాంకేతిక కార్యక్రమంగా మారింది

Ai Summit 2026: ప్రస్తుతం విస్తృతంగా పెరుగుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని మరింత సురక్షితంగా మలిచే ప్రక్రియలో భాగంగా ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ను భారత్ నిర్వహించింది. ఈ అతిపెద్ద ఈవెంట్ కోసం ప్రపంచ నలుమూల నుంచి అతిరథ మహారథులు విచ్చేయడం విశేషం. ఈ రోజు ఈ ప్రత్యేకమైన కార్యక్రమం భారత ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమయ్యింది. ఈ సార్వత్రిక AI సమ్మిట్ 2026 ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యమైన ఒక పెద్ద సాంకేతిక కార్యక్రమంగా మారింది.

Ai Summit 2026:

ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ ను ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించారు. ఇది ఒక అంతర్జాతీయ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ మరియు 16 నుంచి 20 ఫిబ్రవరి 2026 తేదీ వరకు జరుగుతుంది. ఈ అతిపెద్ద వేదిక పై ఈ స‌మ్మిట్‌ లో 20 కంటే ఎక్కువ దేశాల ప్రభుత్వాధికారులు, 45 కంటే ఎక్కువ దేశాల ప్రతినిధులు, ప్రపంచ టెక్ కంపెనీల CEO లు మరియు పెద్ద శాస్త్రవేత్తలతో పాటు పరిశోధకులు కూడా పాల్గొంటారు.

ఈ సమ్మిట్ మరింత సురక్షితమైన AI కోసం అందరిపై ఉన్న సమాన బాధ్యత ను తెలియ చేస్తుంది. అంతేకాదు, వ్యవసాయం, ఆరోగ్యం మరియు విద్య లాంటి ప్రధాన రంగాల్లో ఏఐ ఉపయోగాలు పై దృష్టి పెట్టాల్సిన ప్రాంతాలపై ఫోకస్ చేసే అవకాశం కల్పిస్తుంది.

Ai Summit 2026: ప్రధాన అనౌన్స్‌మెంట్స్

ఈ అతిపెద్ద సమ్మిట్ నుంచి భారత ప్రభుత్వ మద్దతుతో రూపొందించిన Bharat Gen గ్రూప్ ద్వారా Param2 అనే పెద్ద Multilingual AI మోడల్‌ ను ప్రదర్శిస్తున్నారు. ఇది 22 కంటే ఎక్కువ భారతీయ భాషల సపోర్ట్ తో పనిచేస్తుంది. అంతేకాదు, దేశీయ స్టార్టప్ AI మోడల్స్ కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఇందులో మరి ముఖ్యంగా ఇటీవల అంతర్జాతీయ ఏఐ మోడల్స్ కి గట్టి పోటీగా నిలబడిన Sarvam AI ను ప్రదర్శించారు. అలాగే, సైన్ టు టెక్స్ట్ మరియు వేస్ట్ మేనేజ్మెంట్ ఏఐ టూల్స్ వంటి మరిన్ని ఇన్నోవేటివ్ ఏఐ టెక్ ను ప్రదర్శనలో ఉంచారు.

ఈ సమ్మిట్ నుంచి Qualcomm ప్రతినిధి చెప్పిన ‘భవిష్యత్తు AI cloud-only కాకుండా హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ (డివైజ్ + క్లౌడ్) ద్వారానే జరిగే అవకాశం’ ఉందనే స్టేట్మెంట్ అందరినీ ఆకర్షించింది. అంటే, చిన్న ఆన్ డివైజ్ AI రన్నింగ్ అవకాశాన్ని మరింత మెరుగు చేయడం గురించి తెలిపారు.

Also Read: Realme P4 Lite: పెద్ద బ్యాటరీతో కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేస్తున్న రియల్‌మీ.!

ఇంటర్నేషనల్ UPI అప్లికేషన్

ఈ అతిపెద్ద సమ్మిట్ వేదికగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇంటర్నేషనల్ UPI అప్లికేషన్ UPI One World Wallet Service ను ప్రకటించింది. ఇది ప్రపంచ స్థాయి డిజిటల్ పేమెంట్స్ సౌలభ్యానికి ప్రభుత్వం వేసిన ఒక పెద్ద అడుగు అవుతుంది. ఈ కొత్త సర్వీస్ తో UPI తో ఎక్కడికైనా పేమెంట్స్ చేయగలిగే అవకాశం కల్పించారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :