tiktok లో కొత్త ఛాలంజ్ వైరల్ : బ్లూ వెల్ తరువాత మరొక డేంజర్ బెల్

tiktok లో కొత్త ఛాలంజ్ వైరల్ : బ్లూ వెల్ తరువాత మరొక డేంజర్ బెల్
HIGHLIGHTS

ఈ ఛాలంజ్ ఇప్పుడు షోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది.

కొన్ని విషయాలను చూస్తుంటే మనం ఎక్కడికి పోతున్నాం, అసలు ఇంత అమాయకంగా ఎలా ఉంటారు అని కూడా అనుమానం వస్తుంది. బ్లూ వెల్, ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే ఆశ్చర్యపడాల్సిన పని యెంత మాత్రమూ లేదు. ఈ ఛాలంజ్  ప్రజలను భయబ్రాంతులకు గురిచెయ్యడమే కాకుండా,  చాలా మంది అమాయక ప్రజలను ఆత్మహత్యలు చేసుకునేలా చేసింది. ప్రస్తుతం, దీని ముప్పు తొలిగింది అని అనుకునేంత లోపలే మరొక ఛాలంజ్ వైరల్ అవుతోంది. అయితే, ఇది కాళ్లు చేతులు విరిగేలా చెయ్యడం లేదా మెడ మరియు వెన్ను పూసను పనికిరాకుండా చెయ్యడం లేదా కాలం కలిసిరాకపోతే, అంతకంటే ఎక్కువ ప్రమాదమే జరగేలా చెయ్యవచ్చు.

విషయానికి వస్తే, ఈ ఛాలంజ్ ని 'ట్రిప్పింగ్ జంప్' లేదా 'స్కల్  బ్రేకర్ ' ని పిలుస్తుంటారు. దీని పేరులోనే ప్రమాదాన్ని సూచిస్తుంది గమనించండి. స్కల్ బ్రేకర్, అంటే 'పుర్రె పగలగొట్టేది' అని అర్ధం. మరి అంతటి ప్రమాదాన్ని సూచిస్తున్న ఈ ఛాలంజ్ ఇప్పుడు షోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. అందులోనూ, స్కూల్ లేదా కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా అవుతున్నారు. కానీ, ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతారు.

అసలు ఏమిటి ఛాలంజ్ ?

ముందుగా చెప్పినట్లు, ట్రిప్పింగ్ జంప్ అనే ఈ ఛాలంజ్ చెయ్యడానికి మరియు చూడడానికి చాల సింపుల్ గా కనిపిస్తుంది. కానీ, ఇది చాలా ప్రమాదం అని గుర్తుంచుకోండి. ఇక దీని విషయానికి వస్తే, ముగ్గురు వ్యక్తులు ఒకే వరుసలో పక్కపక్కన నిలబడతారు. ఇందులో, ముందుగా ఇరువైపులా వున్నా వారు మధ్యలో ఉన్న వ్యక్తికి ఎలా ఎగరాలో చూపిస్తారు. అసలు విషయం తెలియని మద్యలో వ్యక్తి వాళ్ళు చూపించినట్లు జంప్ (ఎగిరిన) వెంటనే, అతనికి/ఆమెకి ఇరువైపులా వున్నా ఇద్దరూ కూడా ఆ వ్యక్తి రెండు కాళ్ళను తన్నుతారు. అంతే, ఆ ఎగిరిన మధ్యలో వ్యక్తి ఒక్కసారిగా వెళ్లకిలా పడిపోతారు.

ఇది చూడడానికి, ఓస్ ఇంతేనా అనిపిస్తుంది అవునా? కానీ ఎంతమాత్రమూ కాదు. ఎందుకంటే, ఎటువంటి ఆధారం లేకుండా ఒక్కసారే హఠాత్తుగా వెళ్ళికిలా పడే వ్యక్త్తికి,క్రింద పడే వాలును బట్టి అతని తలా పగలవచ్చు లేదా పట్టుతప్పి మెడ ముందుగా నెలకు గుద్దుకుంటే, వెన్నుపూసకు దెబ్బతగిలే ప్రమాదం వుంటుంది. అంతకంటే ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం కూడా వుంది. ఇదేదో సరదాకి చేస్తున్నామనుకొని కుర్రకారు దీనిని ఎక్కువగా ఫాలో అవుతూ, చివరికి ఈ ఛాలంజ్ ని వైరల్ చేసేశారు. కాబట్టి, ఈ ఛాలంజ్ భారిన పడకుండా ఉండడం చాలా మంచిది.                               

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo