మళ్ళీ చైనాకే!! పేరు మారినా తీరు మారని PUBG

మళ్ళీ చైనాకే!! పేరు మారినా తీరు మారని PUBG
HIGHLIGHTS

Battelegrounds Mobile India లాంచ్ ప్రశ్నర్ధకం

చైనాతో సంభందం కొనసాగిస్తోందని ఆరోపణలు

IGN India సమర్పించిన ఒక రిపోర్ట్ నిక్కచ్చిగా చెబుతోంది

PUBG గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలో నిషేదానికి ముందు ఈ గేమ్ అత్యంత ప్రాచుర్యం పొందిన గేమింగ్ యాప్ లలో ఒకటి. అయితే, ఈ గేమ్ చైనాతో ఎక్కువగా కనెక్షన్ కలిగి ఉండడం ఇది నిషేదానికి గురవ్వడానికి ప్రధాన కారణం. ఈ గేమ్ చైనాలోని సర్వర్లకు భారతీయుల ప్రైవసీ డేటాని చేరవేస్తుందన్న కారణంతో ఇండియన్ గవర్నమెంట్ దీన్ని నిషేధించింది. అయితే, ఇప్పుడు Battelegrounds Mobile India పేరుతో ఇండియాలో లాంచ్ అవుతోంది. ఇప్పటికే, ఈ గేమ్ యొక్క Pre-Registration మరియు టెస్టింగ్ బీటాకి కూడా యాక్సెస్ ని కూడా అందించింది. కానీ, ఇప్పుడు ఈ గేమ్ మరొకసారి విమర్శలు ఎదురుకోవడమే కాకుండా చైనాకు డేటాని చేరవేస్తుందన్న ఆరోపణలు కూడా వచ్చాయి.

ప్రైవసీ మరియు సెక్యూరిటీ కారణంగా ఇండియాలో నిషేదానికి గురైన ఈ గేమ్ యొక్క మాతృ సంస్థ, Krafton inc ఈ గేమ్ చైనా సంస్థ Tencent తో సంభంధం లేకుండా నేరుగా ఇండియాలో Battelegrounds Mobile India పేరుతో లాంచ్ చెయ్యడానికి సిద్దమయ్యింది. అయితే, ఈ గేమ్ ఇప్పటికీ డేటాని చైనాలోని కొన్ని సర్వర్లకు పంపుతున్నట్లు, లేటెస్ట్ గా IGN India సమర్పించిన ఒక రిపోర్ట్ నిక్కచ్చిగా చెబుతోంది.   

ఈ డేటా పంపబడుతున్న సర్వర్లలో ఒకటి చైనా మొబైల్ కమ్యూనికేషన్ చేత నడుపబడిందని మరియు సర్వర్ బీజింగ్ లో ఉందని కూడా ఈ నివేదిక పేర్కొంది. ఈ ప్రత్యేక సర్వర్‌కు డివైజ్ డేటా పంపబడుతోందని కూడా ఇది ఈ నివేదిక పేర్కొంది. ఇంకా, ప్రచురణ యొక్క మూలాలు కూడా Battelegrounds Mobile India బీజింగ్‌లో టెన్సెంట్ సర్వర్‌ను పింగ్ చేస్తుంది.  

అసలు విషయం ఏమిటంటే, Battelegrounds Mobile India గేమ్ ను ఇండియాలో పూర్తి స్థాయిలో విడుదల చెయ్యడానికి ముందుగా చైనాతో సంభంధాలను తగ్గించుకోవడం గురించి చాలా పెద్ద ఒప్పందమే చేసుకుంది. అందుకే, చైనాతో సంభంధాలను కొనసాగిస్తే ఈ గేమ్ లాంచ్ ప్రశ్నర్ధకంగా మారవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo