సెక్యూరిటీ లోపం కారణంగా 100 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్లకు పొంచివున్న హ్యాక్ ముప్పు : రిపోర్ట్

సెక్యూరిటీ లోపం కారణంగా 100 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్లకు పొంచివున్న హ్యాక్ ముప్పు : రిపోర్ట్
HIGHLIGHTS

అనేకరకాలైన డేటా హ్యాక్ చెయ్యడానికి అవకాశం ఇచ్చేలా ఉన్నట్లు పేర్కొంది.

Which? అందించిన ఒక కొత్త రిపోర్టు ద్వారా సెక్యూరిటీ లోపం కారణంగా 100 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు హ్యాక్ ముప్పు పొంచివున్నట్లుగా తెలుస్తోంది. Google యొక్క సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వీటికి అందకపోవడమే కారణంగా చెబుతోంది. ఈ నివేదిక యేమని చెబుతోందంటే, పర్సనల్ డేటాతో సహా చాలా ఈ డివైజులలో వుండే అనేకరకాలైన డేటా హ్యాక్ చెయ్యడానికి అవకాశం ఇచ్చేలా ఉన్నట్లు పేర్కొంది. ఈ నివేదిక ఆండ్రాయిడ్ వినియోగదారులు సెక్యూరిటీ ప్యాచ్ ని స్వీకరించక పోవడం వలన కలిగే నష్టాలను గురించి తెలిపింది.

రిపోర్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ల పైన చాలా సందేహాలనే రేకేతించింది. అయితే, సూటిగా మాట్లాడితే మాత్రం 2012 మరియు అంతకంటే ముందు విడుదలైన డివైజుల గురించి నేరుగా ప్రశ్నిస్తోంది.  ఇవన్నీ కూడా  7 సంవత్సరాల క్రితం ఫోన్లు. వాస్తవానికి, గూగుల్ మరియు ఇతర OMEs అన్ని కూడా కేవలం 2 సంవత్సరాల వరకూ మాత్రమే సెక్యూరిటీ అప్డేట్స్ కోసం ప్రామిస్ చేస్తాయి. ఇక ఆండ్రాయిడ్ అయితే 2018 లో ఈ విధానాన్ని మ్యాండేటరి చేసింది. అంటే, ఆండ్రాయిడ్ 8 కంటే తక్కువ వెర్షన్ ఫోన్లకు ఈ ప్రమాదాన్ని సూచిస్తోంది.

ఇందులో మరొక కొత్త కోణం ఏమిటంటే, మూడు సంవత్సరాల క్రితం ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 7 వరకూ మాత్రమే అప్డేట్ చెయ్యబడ్డాయి. అంటే ఈ ఫోన్లు కూడా ఈ భద్రతా లోపం గల ఫోన్ల జాబితాలో నిలిచాయి. అసలు విషయానికి వస్తే, కేవలం రెండు సంత్సరాల అప్డేట్ ని ఇవ్వడం ద్వారా ఎక్కువ కాలం ఫోన్లను ఉపయోగం లేకుండా పోతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఫోన్ల తయారీదారులు మరిన్ని చర్యలు తీసుకోవడం మంచిదని ఈ నివేదిక తెలిపింది. ఎందుకంటే, ప్రస్తుత ఫోన్లు మన బ్యాంక్, ఊద్యోగ, బిజినెస్  వంటి వాటితో పాటుగా ప్రతి పర్సనల్ డేటాని దాచుకునే కేంద్రాలుగా మారడమే కారణం. అటువంటి, ఈ ఫోన్లకు సెక్యూరిటీ లోపం వంటివి హానికరం అవుతుంది.                                                         

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo