PUBG Mobile వీడియో గేమ్ వ్యసనం కారణంగా మరోక యువకుడి జీవితం కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడు PUBG Mobile కు బానిసై మరణించాడు. ఈ నివేదిక ప్రకారం, బాలుడు చాలా రోజులు నుండి నిరంతరాయంగా ఈ గేమ్ ఆడుతున్నాడు. అయితే, ఈ గేమ్ మాయలో పడి అన్నం, నీళ్లు తీసుకోలేదు. ఈ బాలుడు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల మండలంలోని జుజ్జులకుంట గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు.
Survey
✅ Thank you for completing the survey!
కొనసాగుతున్న COVID-19 కరోనావైరస్ మహమ్మారి కారణంగా బాలుడు ఇంటినుండి ఎక్కడికి కధలక పోవడం, అదే సమయంలో చాలా రోజులుగా PUBG మొబైల్ అదే పనిగా ఆడేవాడని తెసుస్తోంది. అతను కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడని మరియు తీవ్రమైన డీ హైడ్రేషన్ తో బాధపడుతున్నట్లు తెలిసింది. అతని కుటుంబ సభ్యులు అతన్ని ఏలూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ముందుగా, COVID-19 కోసం జరిపిన టెస్ట్ లో నెగటివ్ వచ్చింది, తరువాత బాలుడు విరేచనాలతో బాధపడుతూ, చికిత్స మధ్యలో మరణించాడు.
PUBG Mobile రోజులు తరబడి కదలకుండా ఆడడమే మరణానికి కారణమా?
అత్యంత జనాదరణ పొందిన ఈ మొబైల్ గేమ్‌తో ముడిపడి ఉన్న సుదీర్ఘమైన విషాద మరణాలలో ఇది తాజా సంఘటన. ఈ ఏడాది ఆరంభంలో, మహారాష్ట్రలో 25 ఏళ్ల వ్యక్తి PUBG Mobile ఆడుతున్నప్పుడు ఉద్వేగానికి లోనవుతూ స్ట్రోక్ కు గురయ్యి చనిపోయాడు. శవపరీక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న వైద్యుడు, “ఆన్ లైన్ గేమ్ PUBG ఆడుతున్నప్పుడు బాధితుడు అత్యుత్సాహనికి గురవ్వడం వలన, స్ట్రోక్ సంభవించినట్లు అనిపిస్తుంది, అని పేర్కొన్నారు. అలాగే, పోస్ట్-మార్టం రిపోర్ట్ కూడా మెదడు కణజాల నెక్రోసిస్ తో ఇంట్రా సెరిబ్రల్ రక్తస్రావం మరణానికి కారణమని పేర్కొంది ”.
ఇది మాత్రమే PUBG మొబైల్ వలన కలిగిన ఏకైక మరణం కాదు. కొన్ని నెలల క్రితం. 17 ఏళ్ల యువకుడు పబ్ జి మొబైల్ లో 16 లక్షల రూపాయల డబ్బును గేమ్ కోసం ఖర్చు చేశాడని ఆరోపినలు కూడా ఉన్నాయి.