6G కోసం ట్రయల్స్: 5G కంటే 50 రేట్లు వేగం..ఎప్పుడు వస్తుందంటే..!

HIGHLIGHTS

6G నెట్ వర్క్ కోసం ట్రయల్స్ ప్రారంభం

6G నెట్ వర్క్ 5G కంటే 50 రేట్లు వేగం

5జి తరువాత 6G త్వరగా వచ్చే అవకాశం

ఇండియాలో 3G  వచ్చిన చాలా కాలానికి 4G సర్వీస్ వచ్చింది. కానీ, ఇప్పుడు 5G సర్వీస్ తరువాత 6G త్వరగానే రావచ్చని అనిపిస్తోంది. ఎందుకంటే, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యాన్ని మారినంత మెరుగుపరచడం కోసం ప్రభుత్వం ఇప్పటి నుండే 6G నెట్ వర్క్ కోసం ట్రయల్స్ ప్రారంభించింది.

దీనికోసం, టెలికం శాఖ ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ C-DOT కు భాద్యతలను అప్పగించింది. తెలిసిన సమాచారం ప్రకారం, 6G నెట్ వర్క్  సంబంధించిన అన్ని టెక్నీకల్ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని టెలికం శాఖ C-DOT ఆదేశించినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి, ఇప్పటికే  హువావే, LG మరియు శాంసంగ్ వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజాలు 6G కోసం పనిచేస్తున్నాయి. దీని అందించిన ఒక రిపోర్ట్ ప్రకారం 6G నెట్ వర్క్ 5G కంటే 50 రేట్లు వేగంగా ఉంటుంది. ఇక  6G టెక్నలాజి ఎప్పటికి వస్తుందనే విషయం పైన  చర్చించారు. 6G సాంకేతికత 2028 నుండి 2030 మధ్యలో అందివచ్చేఆవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అయితే, వాస్తవానికి ఇప్పటికి ఇండియాలో 4G నెట్ వర్క్ మాత్రమే అందుబాటులో వుంది మరియు రానున్న నెలల్లో 5G నెట్ వర్క్ వచ్చే అవకాశం వుంది. 5G నెట్ వర్క్ కోసం కొన్ని టెలికం సంస్థలు ఇప్పటికే నిర్విఘ్నంగా తమ టెస్టింగ్ ట్రయల్స్ ను కూడా నిర్వహించాయి. మరి 5G కూడా ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాకుండానే 6G నెట్వర్క్ కోసం ఎందుకు పనిచేస్తున్నారు? అని మీరు అనుకోవచ్చు. వాస్తవానికి, 6G విషయంలో ఇతర దేశాల కంటే వెనుకబడకుండా ఉండటానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునట్లు కనిపిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :