ZEBRONICS SILENCIO 111 with premium features launched
ZEBRONICS SILENCIO 111: ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ జెబ్రోనిక్స్ ఈరోజు కొత్త హెడ్ ఫోన్ ను లాంచ్ చేసింది. అదే జెబ్రోనిక్స్ సిలికో 111 మరియు ఈ హెడ్ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ హెడ్ ఫోన్ ఆకట్టుకునే ప్రీమియం లుక్స్ తో ఉంటుంది మరియు జబర్దస్త్ సౌండ్ అందించే 40mm టైటానియం స్పీకర్స్ తో కూడా వస్తుంది.
జెబ్రోనిక్స్ సిలికో 111 హెడ్ ఫోన్ ను రూ. 2,999 ధరతో లాంచ్ చేసింది. ఈ హెడ్ ఫోన్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు జెబ్రోనిక్స్ అధికారిక వెబ్సైట్ నుంచి లభిస్తుంది. ఈ హెడ్ ఫోన్ బ్లాక్,బ్లూ మరియు వైట్ మూడు రంగుల్లో లభిస్తుంది. ఈ హెడ్ ఫోన్ రోజు నుంచి పైన తెలిపిన మూడు ప్లాట్ ఫామ్స్ నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది. జెబ్రోనిక్స్ సరికొత్తగా విడుదల చేసిన ఈ హెడ్ ఫోన్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
జెబ్రోనిక్స్ సిలికో 111 హెడ్ ఫోన్ ను ఎక్కువ సమయం ధరించడానికి అనువైన డిజైన్ తో అందించింది. ఈ హెడ్ ఫోన్ ను రోజంతా ధరించినా ఎటువంటి ఇబ్బంది అనిపించదు అని జెబ్రోనిక్స్ పేర్కొంది. ఈ హెడ్ ఫోన్ జబర్దస్త్ సౌండ్ అందించే 40mm టైటానియం స్పీకర్లు కలిగి ఉంటుంది. ఇది కాకుండా మరింత గొప్ప సౌండ్ అందించే మూడు ఈక్వలైజర్ మోడ్స్ కలిగి ఉంటుంది.
ఈ జెబ్రోనిక్స్ హెడ్ ఫోన్ లో 55 గంటల ప్లే టైమ్ అందించే బిల్ట్ ఇన్ రీఛార్జబుల్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ టైప్ C పోర్ట్ తో ఛార్జ్ అవుతుంది. ఇది వైర్లెస్ హెడ్ ఫోన్ అయినా బ్యాటరీ అయిపోయినప్పుడు కనెక్ట్ చేయడానికి వీలుగా 3.5mm జాక్ పిన్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ గూగుల్ మరియు సిరి లకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ హెడ్ ఫోన్ లో డ్యూయల్ పెయిరింగ్ మోడ్ మరియు లో లెటెన్సీ గేమింగ్ మోడ్ కూడా ఉన్నాయి.
Also Read: Alcatel V3 Ultra 5G లాంచ్ డేట్ మరియు కంప్లీట్ ఫీచర్స్ విడుదల చేసింది.!
ఇక ఈ జెబ్రోనిక్స్ హెడ్ ఫోన్ కలిగిన మెయిన్ ఫీచర్ విషయానికి వస్తే, ఈ హెడ్ ఫోన్ 50dB Hybrid ANC ఫీచర్ తో వస్తుంది. ఈ ఫీచర్ తో ఈ హెడ్ ఫోన్ మీకు ఎటువంటి నోయిస్ లేని లీనమయ్యే సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ హెడ్ ఫోన్ బ్లూటూత్ వెర్షన్ 5.4 తో అంతరాయం లేని కనెక్టివిటీ కూడా అందిస్తుంది.