zebronics new Dolby Soundbar available at rs 4999 on flipkart
న్యూ Dolby Soundbar బిగ్ డిస్కౌంట్ తో రూ. 4,999 ధరకు లభిస్తోంది. నిన్న మొన్నటి వరకు 6వేల రూపాయల ధరకు అమ్ముడైన జెబ్రోనిక్స్ యొక్క న్యూ సౌండ్ బార్ ఈ రోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం 5000 రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తోంది. అతి చవక ధరలో లేదా 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో డాల్బీ సౌండ్ బార్ కోసం చూస్తున్న యూజర్లు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
ప్రముఖ బడ్జెట్ సౌండ్ బార్ బ్రాండ్ గా పేరొందిన జెబ్రోనిక్స్ ఇటీవల విడుదల చేసిన 2.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ Juke Bar 6500 లేదా ZEB-SBSPK C10 మోడల్ సౌండ్ బార్ ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ లో భాగంగా కొన్ని సౌండ్ బార్ డీల్స్ ని ముందుగా అనౌన్స్ అందించింది. ఈ డీల్స్ లో భాగంగా ఈ సౌండ్ బార్ డీల్ ని ఈరోజు ప్రకటించింది.
ఇక ఈ సౌండ్ బార్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఇటీవల కాలంలో రూ. 5,999 రూప్యలాడ్ రెగ్యులర్ డిస్కౌంట్ ప్రైస్ లో సేల్ అవుతుండగా ఈరోజు రూ. 1,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 4,999 ఆఫర్ ధరలో ఫ్లిప్ కార్ట్ సేల్ చేస్తోంది. ఈ ప్రైస్ లో ఇది మంచి సౌండ్ అందించే సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది.
Also Read: Flipkart Sasa Lele Sale బిగ్గెస్ట్ డీల్ గా iPhone 17: నెవర్ బిఫోర్ ధరలో ఫోన్ అందుకోండి.!
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 200W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. రెండు స్పీకర్లు కలిగి ప్రీమియం అండ్ స్లీక్ డిజైన్ కలిగిన బార్ జతగా మంచి బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఈ సౌండ్ బార్ సెటప్ లో ఉంటాయి. ఈ సౌండ్ బార్ LED డిస్ప్లే మరియు వాల్ మౌంట్ సెటప్ కూడా కలిగి ఉంటుంది.
సౌండ్ టెక్నాలజీ పరంగా, ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 2.1 డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అయితే, ఇది వర్చువల్ 5.1 సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుందని జెబ్రోనిక్స్ తెలిపింది. ఇందులో, HDMI, AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. ఈరోజు లభించే డిస్కౌంట్ ప్రైస్ లో బెస్ట్ డీల్ గా కూడా నిలుస్తుంది.