zebronics launches 5.1 dolby soundbar with 500w heavy subwoofer
భారతీయ మార్కెట్లో బడ్జెట్ లో మంచి సౌండ్ బార్ లను అందిస్తున్న జెబ్రోనిక్స్ ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్ పై దృష్టి సారించింది. రెండు రోజుల క్రితం 1030W 5.1.2 డాల్బీ అట్మోస్ ప్రీమియం సౌండ్ బార్ ను అందించిన జెబ్రోనిక్స్, ఇప్పుడు భారీ 500W సబ్ ఉఫర్ తో 5.1 Dolby సౌండ్ బార్ లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ఇంటినే కాదు మొత్తం వీధిని షేక్ చేసే సత్తా కలిగి ఉంటుందని జెబ్రోనిక్స్ ఈ సౌండ్ బార్ గురించి గొప్పగా చెబుతోంది.
జెబ్రోనిక్స్ సరికొత్తగా 950W అవుట్ పుట్ తో Juke Bar 9560 సౌండ్ బార్ ను విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ ను రూ. 23,999 ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా మరియు కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి సేల్ కి కూడా అందుబాటులోకి వచ్చింది.
జెబ్రోనిక్స్ కొత్తగా విడుదల చేసిన ఈ సౌండ్ బార్ కొత్త డిజైన్ తో చూడముచ్చటగా ఉంటుంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో క్లియర్ వోకల్స్ మరియు క్రిస్పీ సౌండ్ కోసం 6 స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది. ఈ బార్ తో జతగా 500W హెవీ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ మరియు డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో వస్తుంది కాబట్టి ఎటువంటి వైర్ బెడద లేకుండా సింపుల్ గా సెటప్ చేసుకోవచ్చు.
ఈ లేటెస్ట్ సౌండ్ బార్ 5.1 డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. వాస్తవానికి, ఇదే ధరలో డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ లు లభిస్తుండగా ఈ సౌండ్ బార్ ను మాత్రం డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో మాత్రమే అందించింది. అయితే, ఇది 950W హెవీ సౌండ్ తో మొత్తం వీధిని షేక్ చేసే సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Flipkart Sale నుంచి POCO F7 5G పై బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అనౌన్స్ చేసింది.!
ఈ సౌండ్ బార్ తో జతగా ఫుల్ ఫంక్షన్ రిమోట్ కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ లో వాల్యూమ్ కంట్రోల్ మరియు LED ఇండికేటర్ కూడా ఉంటుంది.