ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ ని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి సగం ధరకే అందుకోండి.!

HIGHLIGHTS

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ ని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి సగం ధరకే అందుకోండి

GOAT Sale చివరి రోజైన ఈరోజు ఈ డీల్ ను ప్రత్యేకంగా అందించిన బెస్ట్ డీల్

ఈ సౌండ్ బార్ ఈరోజు లభించే ప్రైస్ లో నిజంగా జబర్దస్త్ డీల్ అవుతుంది

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ ని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి సగం ధరకే అందుకోండి. ఈ ఎంత చెబుతోంది నేను కాదు ఫ్లిప్ కార్ట్. GOAT Sale చివరి రోజైన ఈరోజు ఈ డీల్ ను ప్రత్యేకంగా అందించినట్లు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు లభించే ప్రైస్ లో నిజంగా జబర్దస్త్ డీల్ అవుతుంది. ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ చివరి రోజు అందించిన ఈ డీల్ పై ఒక లుక్కేద్దామా.

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్

జెబ్రోనిక్స్ రీసెంట్ పవర్ ఫుల్ సౌండ్ బార్ Juke Bar 10000 ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నుంచి సగం ధరలో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ రూ. 44,999 రూపాయల ఆఫర్ ధరలో గత సంవత్సరం లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ చివరి రోజు అందించిన రూ. 13,000 భారీ డిస్కౌంట్ తో రూ. 31,999 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు, ఈ ఫోన్ పై రూ. 3,000 భారీ కూపన్ డిస్కౌంట్ అందించింది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై రూ. 1,500 రూపాయల ICICI, HSBC మరియు BOB బ్యాంక్ క్రెడిట్ కార్డు అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ అన్ని ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నుంచి కేవలం రూ. 27,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. అంటే, ఈ సౌండ్ బార్ ఈరోజు దాదాపు సగం ధరకే మీకు లభిస్తుంది.

Also Read: BSNL Satellite Phone: ఎక్కడి నుంచైనా ఫోన్ చేసే శాటిలైట్ ఫోన్ లాంచ్ చేసిన బిఎస్ఎన్ఎల్.!

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఇది జెబ్రోనిక్స్ అందించిన ప్రీమియం సౌండ్ బార్ మరియు ఈ సౌండ్ బార్ జబర్దస్త్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 7.2.4 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో ఫ్రంట్, అప్ మరియు సైడ్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ ఉంటుంది. ఇది కాకుండా ఇందులో అప్ ఫైరింగ్ అండ్ ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు సూపర్ బాస్ సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 1100W జబర్దస్త్ సౌండ్ తో వస్తుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ మరియు DTS X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లు కలిగి సినిమా థియేటర్ వంటి జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, జెబ్రోనిక్స్ యొక్క ప్రత్యేకమైన Zeb-Acousti Max మల్టీ డైమెన్షనల్ ఆడియో టెక్నాలజీ తో మరింత క్లీన్ అండ్ క్లియర్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI eARC, బ్లూటూత్ 5.3, ఆప్టికల్, AUX మరియు USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :