zebronics 7.2.4 Dolby Atmos got big price cut
ఇంటిని షేక్ చేసే జబర్దస్త్ సౌండ్ అందించే పవర్ ఫుల్ సౌండ్ బార్ కొనాలని చూసే వారికి గుడ్ న్యూస్. జెబ్రోనిక్స్ లేటెస్ట్ 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఈ రోజు భారీ ప్రైస్ కట్ అందుకుని చాలా రీజనబుల్ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ 2025 సంవత్సరం బడ్జెట్ ధరలో ఇండియాలో విడుదలైన ఏకైక 7.2.4 ఛానల్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ గా నిలిచింది. అయితే, ఈ సౌండ్ బార్ ప్రీమియం ధరలో లాంచ్ అయ్యింది. కానీ, ఈ ప్రీమియం సౌండ్ బార్ ఈ రోజు బిగ్ ప్రైస్ కట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది.
జెబ్రోనిక్స్ గత సంవత్సరం విడుదల చేసిన Juke BAR 10000 సౌండ్ బార్ ఈరోజు ఈ బిగ్ ప్రైస్ కట్ ను అందుకుంది. జెబ్రోనిక్స్ ఈ సౌండ్ బార్ ను రూ. 44,999 రూపాయల ఆఫర్ ధరలో లాంచ్ చేసింది. అయితే, ఈ సౌండ్ బార్ ఈ రోజు రూ. 8,000 రూపాయల భారీ ప్రైస్ కట్ తో కేవలం రూ. 36,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. అయితే, ఈ సౌండ్ బార్ అఫీషియల్ సైట్ నుంచి కాకుండా అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ ప్రైస్ కట్ ప్రైస్ లో సేల్ అవుతోంది.
అవును, ఈ సౌండ్ బార్ పై అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ రెండు ప్లాట్ ఫామ్స్ కూడా అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించాయి. ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ సౌండ్ బార్ ను Axis బ్యాంక్ క్రెడిట్ కార్డుతో తీసుకునే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అలాగే, అమెజాన్ నుంచి ఈ సౌండ్ బార్ ని SBI మరియు HDFC క్రెడిట్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 1,000 నుంచి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 35,499 నుంచి రూ. 35,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read: WhatsApp ఈరోజు నుంచి ఈ ఫోన్లలో పనిచేయడం మానేస్తుంది .. కారణం ఏమిటంటే.!
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 7.2.4 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో ఫ్రంట్, సైడ్ మరియు అప్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ కలిగిన ప్రీమియం బార్, ఫ్రంట్ అండ్ అప్ స్పీకర్ కలిగిన డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ ఉఫర్ అండ్ బిల్ట్ ఇన్ పాసివ్ రేడియేటర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ క్లిజ్ఞ కంప్లీట్ స్పీకర్ సెటప్ తో మొత్తం రూమ్ ని ఫీల్ చేసే గొప్ప సరౌండ్ సౌండ్ మరియు డీప్ బాస్ సౌండ్ ని కూడా అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ మరియు DTS: X సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా జెబ్రోనిక్స్ సౌండ్ బార్స్ కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేసిన జెబ్ అకౌష్టి మాక్స్ మల్టీ డైమెన్షియల్ ఆడియో ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ థియేటర్ స్థాయి 3D సౌండ్ ను ఆఫర్ చేస్తుంది. ఇది ఆప్టికల్ ఇన్, HDMI Arc, USB, AUX మరియు బ్లూటూత్ వంటి మల్టి కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.