Soundbar Deals: అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ సేల్ ఆఫర్ చేసే బిగ్ డీల్స్ ఇవే గురు.!

HIGHLIGHTS

అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ తమ అప్ కమింగ్ సేల్ ను అనౌన్స్ చేసాయి

అమెజాన్ Prime Day 20026 సేల్ అనౌన్స్ చేయగా ఫ్లిప్ కార్ట్ GOAT Sale అనౌన్స్ చేసింది

ఈ అప్ కమింగ్ సేల్ నుంచి సౌండ్ బార్ లను భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో మీ బడ్జెట్ లో అందుకునే అవకాశం ఉంటుం

Soundbar Deals: అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్ కార్ట్ తమ అప్ కమింగ్ సేల్ ను అనౌన్స్ చేసాయి. అమెజాన్ Prime Day 20026 సేల్ అనౌన్స్ చేయగా ఫ్లిప్ కార్ట్ GOAT Sale అనౌన్స్ చేసింది. ఈ రెండు పెద్ద ఇకార్ట్ కంపెనీలు కూడా అప్ కమింగ్ సేల్ నుంచి అందించనున్న భారీ ఆఫర్లు మరియు డీల్స్ గురించి భారీగా టీజింగ్ కూడా మొదలుపెట్టాయి. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి సౌండ్ బార్ లను భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో మీ బడ్జెట్ లో అందుకునే అవకాశం ఉంటుంది.

Soundbar Deals: ఏమిటి ఈ డీల్స్?

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ తో పోటీగా సౌండ్ బార్ లు మార్కెట్ లో అమ్ముడవుతున్నాయి. దీనికి మంచి కారణం కూడా ఉంది. ఒక స్మార్ట్ టీవీ మరియు సౌండ్ బార్ కలిగి ఉంటే సినిమా థియేటర్ అనుభూతిని ఇంట్లోనే పొందొచ్చు. అందుకే, స్మార్ట్ టీవీ కి జతగా ఒక మంచి సౌండ్ బార్ ను కలిగి ఉండటం మంచి ఒక మంచి విషయం గా చూస్తున్నారు.

అయితే, సౌండ్ బార్ ను ఎప్పుడు కొనాలి అని కూడా తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే, సేల్ సమయంలో కొన్ని సౌండ్ బార్ లు గతంలో ఎప్పుడు చూడని అతి చవక ధరలో సేల్ అవుతాయి. ఉదాహరణకు గత సంవత్సరం మధ్యలో జెబ్రోనిక్స్ రూ. 44,999 రూపాయల ధరలో లాంచ్ చేసిన 7.2.4 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ఇటీవల ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ సేల్ నుంచి అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 32,999 రూపాయల అతి చవక ధరలో లభించింది.

ఇలా చెప్పుకుంటూ వెళితే పెద్ద లిస్ట్ ఉంది. ఇప్పుడు కూడా అలంటి అవకాశం మీకోసం సిద్ధం గా ఉంది. కొత్తగా అమెజాన్ మరియు ఫ్లిప్ ఆకృతి అనౌన్స్ చేసిన సేల్ నుంచి మరోసారి సౌండ్ బార్ లను అతి చవక ధరలో అందుకునే ఛాన్స్ మీకు వస్తుంది. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి మీరు బెస్ట్ సౌండ్ బార్స్ పై జబర్దస్త్ డిస్కౌంట్ ను ఎక్స్పెక్ట్ చేయవచ్చు.

Also Read: GOAT Sale ప్రకటించిన ఫ్లిప్ కార్ట్ .. టాప్ డీల్స్ తో టీజింగ్ కూడా స్టార్ట్ చేసింది.!

Soundbar Deals: బెస్ట్ డీల్స్

అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ నుంచి కొన్ని బెస్ట్ డీల్స్ ను మనం ఆశించవచ్చు. ఇందులో మొదటిది Sony HT-S20R సౌండ్ బార్ డీల్. ఇది మార్కెట్ లో అత్యధికంగా అమ్ముడైన 5.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్. ఇది గత సేల్ నుంచి 14 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించింది. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి కూడా ఈ సౌండ్ బార్ 14 వేల రూపాయల కంటే తక్కువ బడ్జెట్ ధరలో లభించే అవకాశం ఉండొచ్చు.

జెబ్రోనిక్స్ యొక్క 7.2.4 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కూడా అప్ కమింగ్ సేల్ నుంచి అతి చవక ధరలో లభించే అవకాశం ఉండవచ్చు. ఇదే కాదు, Samsung, LG మరియు JBL వంటి బిగ్ బ్రాండ్ సౌండ్ బార్స్ పైన కూడా గొప్ప డిస్కౌంట్ లు లభించే అవకాశం ఉంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :