చవక ధరల్లో 24bit స్పెటియల్ సౌండ్ తో కొత్త Buds ECHO ఇయర్ బడ్స్ లాంచ్.!

Updated on 15-Feb-2025
HIGHLIGHTS

Truke కొత్త Buds ECHO బడ్స్ ను లాంచ్ చేసింది

ఈ బడ్స్ ను 24bit స్పెటియల్ సౌండ్ తో అందించింది

ఈ బడ్స్ ను కేవలం రూ. 1,299 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ చేసింది

ఇప్పుడు ఇండియాలో మంచి ఫీచర్స్ కలిగిన ఇయర్ బడ్స్ సైతం బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఈ కాంపిటీషన్ మార్కెట్ ను తట్టుకునేలా Truke కొత్త బడ్స్ ను లాంచ్ చేసింది. అదే Buds ECHO ఇయర్ బడ్స్ మరియు ఈ బడ్స్ ను 24bit స్పెటియల్ సౌండ్ తో అందించింది. అంతేకాదు, ఈ బడ్స్ ను బడ్జెట్ ధరలో అందించి. ఇండియన్ మార్కెట్ లో సరికొత్తగా విడుదలైన ఈ కొత్త ఇయర్ బడ్స్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

Truke Buds ECHO : ప్రైస్

ట్రూక్ ఈ కొత్త ఇయర్ బడ్స్ ను రూ. 3,000 రూపాయల ధరతో ప్రకటించినా, ఈ బడ్స్ ను కేవలం రూ. 1,299 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ చేసింది. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి ఈ బడ్స్ సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ బడ్స్ ను అమెజాన్ ఇండియా నుండి లభిస్తాయి.

Truke Buds ECHO : ఫీచర్స్

ఈ ట్రూక్ ఎకో బడ్స్ గొప్ప ఆడియో క్వాలిటీ అందించే 24-bit ఆడియో ఫీచర్ తో అందించింది. 24-bit ఆడియో అనేది అనలాగ్ సౌండ్ వేవ్ లను మరింత క్వాలిటీ సౌండ్ గా మార్చే సౌండ్ ఫార్మాట్ గా చెప్పబడుతుంది. ఇందులో, గతంలో 16-bit తో బడ్స్ వచ్చేవి ప్రసుతం ప్రీమియం బడ్స్ 24-బిట్ ఆడియో సపోర్ట్ తో వస్తున్నాయి.

ఈ కొత్త బడ్స్ ను హై క్వాలిటీ సౌండ్ అందించే టైటానియం డైనమిక్ స్పీకర్స్ తో అందించినట్లు ట్రూక్ తెలిపింది. ఈ బడ్స్ మంచి డీటెయిల్స్ మరియు Deep BASS సౌండ్ అందిస్తుందని కూడా ట్రూక్ పేర్కొంది. ఈ బడ్స్ మల్టీ డివైజ్ కనెక్టివిటీ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటాయి.

Also Read: Flipkart Sale నుంచి గొప్ప డిస్కౌంట్ తో తక్కువ ధరలో వచ్చే 55 ఇంచ్ QLED Smart Tv ఇదే.!

ఇక ఈ బడ్స్ లో అందించిన బ్యాటరీ మరియు ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బడ్స్ టోటల్ 70 గంటల ప్లే టైం అందిస్తుంది మరియు క్వాడ్ మైక్ ENC ఫీచర్ తో కూడా వస్తుంది. అంటే, అధిక సమయం మ్యూజిక్ ప్లే తో పాటు గొప్ప క్వాలిటీ కాలింగ్ ఈ బుడ్స్లో అందుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

ఈ బడ్స్ ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది మరియు ఆరంజ్, గ్రీన్ మరియు బ్లాక్ మూడు రంగుల్లో లభిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :