todays best Dolby Atmos atmos soundbar deal under rs 6000
స్మార్ట్ టీవీ లేదా ప్రొజెక్టర్ లో సినిమా లేదా సిరీస్ లను ఎంజాయ్ చేయాలంటే మంచి సౌండ్ బార్ కలిగి ఉండాలి. అయితే, ఈ సౌండ్ బార్ లో డాల్బీ ఆడియో లేదా డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ఉంటే మజానే వేరు. ఎందుకంటే, డాల్బీ సౌండ్ సపోర్ట్ తో వచ్చే సౌండ్ బార్ థ్రిల్ సౌండ్ అందిస్తుంది. అయితే, డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కొనాలంటే 10 వేల రూపాయలైనా ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే, కేవలం రూ. 5,999 రూపాయల ధరలోనే Dolby Atmos సౌండ్ ఆఫర్ ఒకటి ఈరోజు మీకు అందుబాటులో ఉంది.
జెబ్రోనిక్స్ యొక్క లేటెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Juke Bar 9600 ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ తర్వాత నుంచి ఈ సౌండ్ బార్ ను 77% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 5,999 రూపాయల ధరలో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ రూ. 8,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. కానీ, ఈ రోజు కేవలం రూ. 5,999 ఆఫర్ ధరలో లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ మరియు వాల్ మౌంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ స్లీక్ అండ్ ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ఇండికేషన్ కోసం LED డిస్ప్లే కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో నాలుగు ప్రీమియం స్పీకర్లు కలిగిన బార్ మరియు మంచి బాస్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 300W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది 2.1 ఛానల్ సౌండ్ బార్ అయినా కూడా వర్చువల్ 5.1 ఫీచర్ తో మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Gemini 3.5: ఇప్పుడు AI కేవలం మాట్లాడదు .. పనులు కూడా చేస్తుంది బాసు.!
ఈ సౌండ్ బార్ ఓవరాల్ 4.1 రేటింగ్ ను అమెజాన్ యూజర్ల నుంచి అందుకుంది. అంతేకాదు, మంచి రివ్యూలు కూడా ఈ సౌండ్ బార్ పొందింది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి లభించే ప్రైస్ లో ఇది బెస్ట్ బడ్జెట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది.