cmf buds పై ఈరోజు గొప్ప డీల్స్ ఆఫర్ చేసిన Flipkart: రూ. 1899 నుంచి ప్రైస్ స్టార్ట్

Updated on 04-Jun-2025
HIGHLIGHTS

cmf buds పై ఈరోజు Flipkart గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది

మంచి ANC సపోర్ట్, భూమింగ్ BASS మరియు గొప్ప సౌండ్ అందించే బడ్స్

గొప్ప సౌండ్ అందించే బడ్స్ గా ఈ బడ్స్ మంచి రివ్యూలు అందుకున్నాయి

ముఖ్యంగా CMF ఫోన్ కలిగిన యూజర్లకు ఈ బడ్స్ మంచి జోడిగా ఉంటాయి

cmf buds పై ఈరోజు Flipkart గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది. మంచి ANC సపోర్ట్, భూమింగ్ BASS మరియు గొప్ప సౌండ్ అందించే బడ్స్ గా ఈ బడ్స్ మంచి రివ్యూలు అందుకున్నాయి. ముఖ్యంగా CMF ఫోన్ కలిగిన యూజర్లకు ఈ బడ్స్ మంచి జోడిగా ఉంటాయి. మరి ఫ్లిప్ కార్ట్ ఈ సిఎమ్ఎఫ్ బడ్స్ పై ఇస్తున్న ఆఫర్స్ ఏమిటో చూద్దామా.

Flipkart cmf buds ఆఫర్స్

సిఎమ్ఎఫ్ ఇండియాలో నాలుగు ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది. ఇందులో లేటెస్ట్ బడ్స్ కూడా ఉన్నాయి. అయితే, గత సంవత్సరం సిఎమ్ఎఫ్ విడుదల చేసిన బడ్స్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఇందులో సిఎమ్ఎఫ్ బడ్స్ మరియు బడ్స్ 2 ప్రో రెండు బడ్స్ ఉన్నాయి. ఈ రెండు డీల్స్ గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం.

సిఎమ్ఎఫ్ బడ్స్

ఈ బడ్స్ ను రూ. 2,499 ధరతో సిఎమ్ఎఫ్ ఇండియాలో లాంచ్ చేసింది. ఈ బడ్స్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ రూ. 600 తగ్గింపు అందించి కేవలం రూ. 1,899 రూపాయల ఆఫర్ ప్రైస్ తో సేల్ చేస్తోంది. ఈ బడ్స్ 42dB ANC (యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్),12.4mm బయో ఫైబర్ డైనమిక్ డ్రైవర్స్ మరియు అల్ట్రా BASS వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఈ బడ్స్ IP54 రేటింగ్, 35 గంటల ప్లే టైమ్ అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది.

Also Read: Lava Bold N1 : ఈరోజు నుంచి మొదలైన లావా అతి చవక ఫోన్ సేల్.!

సిఎమ్ఎఫ్ బడ్స్ ప్రో 2

సిఎమ్ఎఫ్ బడ్స్ ప్రో 2 ఇయర్ బడ్స్ ని ఇండియాలో రూ. 4,299 రూపాయల ప్రైస్ తో లాంచ్ చేసింది. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ బడ్స్ పై రూ. 800 బిగ్ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 3,499 ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ బడ్స్ బ్లూ, బ్లాక్, ఆరంజ్ మరియు లైట్ గ్రే నాలుగు రంగుల్లో లభిస్తుంది.

ఈ బడ్స్ గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది, అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ బడ్స్ 11mm బాస్ స్పీకర్లు మరియు 6mm ట్వీటర్ లను కలిగి ఉంటుంది. కేవలం స్పీకర్లు మాత్రమే కాదు ఈ బడ్స్ LDAC, Hi-Res మరియు Dirac ఆప్టియో సౌండ్ వంటి ఫీచర్స్ తో క్లియర్ మరియు జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ 50dB హైబ్రిడ్ ANC ఫీచర్ తో బయటి శబ్దాలు నిరోధించి క్లీన్ సౌండ్ మరియు కాలింగ్ అందిస్తుంది. ఇది కాకుండా విండ్ నోయిస్ రిడక్షన్ సపోర్ట్ కలిగిన 6HD మైక్స్ తో మంచి కాలింగ్ సౌలభ్యం కూడా అందిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :