Spotify Down in us and india still users facing problems
Spotify Down: ప్రముఖ ఆడియో ప్లేయర్ ప్లాట్ ఫామ్ స్పాటిఫై ఈరోజు అనుకోకుండా మూగబోయింది. ఉచిత మరియు ప్రీమియం సబ్ స్కైబర్స్ కూడా ఈరోజు ఈ యాప్ పని చేయడం మానేసినట్లు రిపోర్ట్ చేశారు. ప్రముఖ సైట్ డౌన్ ట్రాకింగ్ ప్లాట్ ఫామ్ డౌన్ డిటెక్టర్ పై అనేక మంచి యూజర్లు స్పాటిఫై డౌన్ అయినట్లు రిపోర్ట్ నమోదు చేసారు. అంతేకాదు, సోషల్ మీడియాలో కూడా చాలా మంది యూజర్లు స్పాటిఫై డౌన్ ను వెల్లడిస్తూ హాస్యాస్పదమైన మీమ్స్ తో పోస్ట్ లు కూడా షేర్ చేశారు.
ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి స్పాటిఫై ప్లాట్ ఫామ్ సరిగా పనిచేయడం లేదని యూజర్లు డౌన్ డిటెక్టర్ లో రిపోర్ట్స్ చేయడం ప్రారంభించారు. అయితే, రాత్రి 8 గంటల సమయానికి ఈ రిపోర్ట్స్ సంఖ్య తారాస్థాయికి చేరుకుంది. ఈ న్యూస్ వ్రాసే సమయానికి కూడా స్పాటిఫై ప్లాట్ ఫామ్ డౌన్ అయినట్లు డౌన్ డిటెక్టర్ లో రిపోర్ట్స్ నమోదు అవుతూనే ఉన్నాయి.
డౌన్ డిటెక్టర్ పై అందుకున్న రిపోర్ట్స్ ప్రకారం, స్పాటిఫై లో ఎక్కువగా సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో యూజర్ రిపోర్ట్ గ్రాఫ్ ప్రకారం, 45 శాతం మంది యూజర్లు స్పాటిఫై యాప్ లో సమస్య చూసినట్లు, 28 శాతం మంది లాగిన్ సమస్య చూసినట్లు మరియు 15 శాతం మంది యూజర్లు సర్వర్ కనెక్షన్ లో సమస్య చూసినట్లు రిపోర్ట్ చేశారు.
Also Read: Chiranjeevi: ఓటీటీ వేదికగా తన సినీ ప్రయాణ ఆసక్తికరమైన అనుభవాలను షేర్ చేసుకోబోతున్న మెగాస్టార్.!
స్పాటిఫై లో సమస్య కారణంగా పాటలు ప్లే కావడం లేదని కొందరు, లాగిన్ కావడం లేదని కొందరు యాప్ బ్లాంక్ అయినట్లు కొందరు యూజర్లు వెల్లడించారు. కేవలం వెల్లడించడం మాత్రం కాదు కొందరు యూజర్లు ఈ సమస్య గురించి అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా పోస్ట్ చేశారు.
ఈ సమస్య పై స్పాటిఫై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. ఈ సమస్యకు దారి తీసిన రీజన్ ను స్పాటిఫై ఆటో త్వరలో వెల్లడిస్తుందని భావిస్తున్నాము.