sony launches Sony BRAVIA Theatre Bar 7 with cinematic soundbar
ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ సినిమాటిక్ సౌండ్ తో Sony BRAVIA Theatre Bar 7 సౌండ్ బార్ లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ నిజమైన సినిమా థియేటర్ ఫీల్ ని ఇంట్లోనే అందించే సెటప్ తో ఈ సౌండ్ బార్ ను అందించింది. ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సేల్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ప్రైస్ మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
సోనీ ఈ కొత్త సౌండ్ బార్ ను రియల్ సినిమాటిక్ సౌండ్ తో ఆఫర్ చేసినట్లు సోనీ తెలిపింది. ఈ సౌండ్ బార్ అందమైన మరియు ప్రీమియం డిజైన్ తో వచ్చింది. ఈ సౌండ్ బార్ 5.0.2 ఛానల్ సెటప్ ఉంటుంది. ఇందులో టోటల్ 9 ప్రీమియం స్పీకర్లు ఉంటాయి. ఈ సౌండ్ బార్ కలిగిన టోటల్ సెటప్ తో ఇంటి మొత్తాన్ని సరౌండ్ సౌండ్ తో ఫిల్ చేస్తుంది.
ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ సెటప్ విషయానికి వస్తే, ఇందులో ముందు సెంటర్, లెఫ్ట్ రైట్ స్పీకర్లు మరియు 2 ట్వీటర్ స్పీకర్లు ఉంటాయి. అలాగే, రెండు అప్ ఫైరింగ్ మరియు రెండు సైడ్ ఫైరింగ్ స్పీకర్లు కూడా ఉంటాయి. ఈ సెటప్ తో ముందు, పెయిన్ మరియు సైడ్ నుంచి ఈ సౌండ్ బార్ సౌండ్ ని ఆఫర్ చేస్తుంది. అందుకే, ఇది సినిమా థియేటర్ స్థాయి సరౌండ్ సౌండ్ అందిస్తుంది.
ఇక ఈ సోనీ లేటెస్ట్ సౌండ్ బార్ కలిగిన సౌండ్ అండ్ విజువల్ సపోర్ట్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ Dolby Atmos మరియు DTS X సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, 360 స్పేషియల్ సౌండ్ మ్యాపింగ్ ఫీచర్ తో గొప్ప 3D సౌండ్ అందిస్తుంది. ఈ ఫీచర్ తో సౌండ్ ఎక్కడి నుంచి వినిపించాలో అక్కడ స్పీకర్ లేకున్నా సౌండ్ వినిపించేలా డిజైన్ చేయండి.
ఇందులో మంచి పాస్ త్రూ సపోర్ట్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ 8K HDR, 120FPS 4K మరియు డాల్బీ విజన్ సపోర్ట్ తో వస్తుంది. అంటే, సినిమాటిక్ సౌండ్ తో పాటు అత్యున్నత స్క్రీన్ విజువల్స్ కోసం కూడా సపోర్ట్ చేస్తుంది.
ఈ సౌండ్ బార్ తో మరిన్ని స్పీకర్లను కూడా జత చేసుకునే అవకాశం ఉంది. ఈ సౌండ్ బార్ తో వైర్లెస్ సబ్ ఉఫర్ మరియు రియర్ స్పీకర్ లను జత చేసుకోవచ్చు. అయితే, వాటిని విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
Also Read: Fire Boltt Phone: మొబైల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఇండియా ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్.!
సోనీ ఈ సౌండ్ బార్ ను ప్రీమియం రేంజ్ లో విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ ని MRP : 99.990 తో ల్సి చేసి, రూ. 82,990 రూపాయల ప్రైస్ తో ఇండియాలో విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ ఈరోజు నుంచి Sony Center మరియు Sony Exclusive Stores నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది.