Realme Buds T200 Lite launch confirmed with top bass and more power
Realme Buds T200 Lite: రియల్ మీ బడ్జెట్ ఇయర్ బడ్స్ సిరీస్ నుంచి అప్ కమింగ్ ఇయర్ బడ్స్ లాంచ్ అనౌన్స్ చేసింది. అదే రియల్ మీ బడ్స్ టి200 లైట్ మరియు ఈ బడ్స్ ను టాప్ టాప్ BASS మరియు ఎండ్ లెస్ పవర్ ఫీచర్స్ తో లాంచ్ చేయనున్నట్లు రియల్ మీ ప్రకటించింది. ఈ రియల్ మీ అప్ కమింగ్ బడ్స్ కీలకమైన ఫీచర్స్ కూడా రియల్ మీ బయటపెట్టింది.
రియల్ మీ బడ్స్ టి200 లైట్ బడ్స్ ను మార్చి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ బడ్స్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. అంటే, Realme P3 మరియు Realme P3 Ultra స్మార్ట్ ఫోన్ లతో పాటు ఈ బడ్స్ కూడా లాంచ్ చేస్తుంది. అయితే, ఈ బడ్స్ మాత్రం అమెజాన్ ఇండియా నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి.
రియల్ మీ బడ్స్ టి200 లైట్ బడ్స్ కీలకమైన ఫీచర్స్ కూడా రియల్ మీ ఇప్పటికే వెల్లడించింది. ఈ బడ్స్ ను 12.4mm డైనమిక్ బాస్ స్పీకర్లతో అందిస్తున్నట్లు తెలిపింది. గొప్ప కాలింగ్ కోసం డ్యూయల్ మైక్ AI డీప్ కాల్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్స్ కూడా ఈ బడ్స్ లో ఉంటుంది.ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ IPX4 రేటింగ్ తో నీటి తుంపర్లు మరియు చెమట నుంచి రక్షణ కలిగి ఉంటుంది.
ఈ రియల్ మీ అప్ కమింగ్ బడ్స్ డ్యూయల్ డివైజ్ కనెక్షన్ తో కూడా వస్తుంది. అంతేకాదు, ఈ బడ్స్ ను ఆకట్టుకునే డిజైన్ మరియు రంగుల్లో లాంచ్ చేస్తోంది. ఈ బడ్స్ ను 48 గంటల టోటల్ ప్లే టైమ్ అందించే పవర్ ఫుల్ బ్యాటరీతో అందిస్తున్నట్లు రియల్ మీ కన్ఫర్మ్ చేసింది. ఈ బడ్స్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు మరిన్ని ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది.
Also Read: Oppo F29 Series 5G: కొత్త సిరీస్ నుంచి స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తున్న ఒప్పో.!
ఈ రియల్ మీ అప్ కమింగ్ బడ్స్ ప్రైస్ కూడా బడ్జెట్ యూజర్లను ఆకట్టుకునే విధంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.