Realme Buds Air 6: Hi-Res సర్టిఫైడ్ ఇయర్ బడ్స్ తెస్తున్న రియల్ మీ.!

HIGHLIGHTS

Realme GT 6T స్మార్ట్ ఫోన్ తో పాటు Realme Buds Air 6 ను కూడా విడుదల చేస్తోంది

ఈ అప్ కమింగ్ బడ్స్ వివరాలతో టీజింగ్ కూడా మొదలు పెట్టింది

ఈ బడ్స్ ను Hi-Res సర్టిఫికేషన్ తో తీసుకొస్తున్నట్లు గొప్పగా చెబుతోంది

Realme Buds Air 6: మే 22 వ తేదీ పెద్ద ఈవెంట్ నే రియల్ మీ ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ నుండి Realme GT 6T స్మార్ట్ ఫోన్ తో పాటు రియల్ మీ బడ్స్ ఎయిర్ 6 ను కూడా విడుదల చేస్తోంది. ఈ కమింగ్ బడ్స్ వివరాలతో టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఈ బడ్స్ ను Hi-Res సర్టిఫికేషన్ తో తీసుకొస్తున్నట్లు గొప్పగా చెబుతోంది.

Realme Buds Air 6 డిజైన్ & లాంచ్

ఈ రియల్ మీ అప్ కమింగ్ బడ్స్ డిజైన్ చూడటానికి దాదాపు రియల్ మీ బడ్స్ ఎయిర్ 5 మాదిరిగా కనిపిస్తోంది. అయితే, చిన్న చిన్న మార్పులు మరియు మరింత స్లీక్ గా కనిపిస్తోంది. ఈ బడ్స్ ను మే 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో ఈ బడ్స్ ను లాంచ్ చేస్తోంది.

Also Read: 60X Zoom కెమెరాతో వస్తున్న Tecno Camon 30 Premier 5G స్మార్ట్ ఫోన్.!

Realme Buds Air 6 : ఫీచర్స్

ఈ రియల్ మీ బడ్స్ ఎయిర్ 6 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇండియాలో ఏకైక Hi-Res సర్టిఫైడ్ TWS బడ్స్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ రియల్ మీ ఇయర్ బడ్స్ Hi-Res వైర్లెస్ ఆడియో మరియు LHDC 5.0 సపోర్ట్ తో వస్తుంది. ఇందులో 12.4mm బిగ్ స్పీకర్లు ఉన్నట్లు కూడా రియల్ మీ తెలిపింది.

Realme Buds Air 6

ఈ ఇయర్ బడ్స్ ను 50db యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) తో అందిస్తోంది. అంతేకాదు, ఈ బడ్స్ 6-mic ENC సపోర్ట్ తో క్రిస్టల్ క్లియర్ కాలింగ్ కూడా అందిస్తుందని కూడా రియల్ మీ తెలిపింది. మంచి సీఎం లెస్ గేమింగ్ కోసం 55ms సూపర్ లో లెటెన్సీ ఫీచర్ ను కూడా కలిగి ఉందని రియల్ మీ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :