Portronics: బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ తో సౌండ్ బార్స్ లాంచ్.!

HIGHLIGHTS

Portronics కొత్త సౌండ్ బార్ లను విడుదల చేసింది

Sound Slick సిరీస్ నుండి తరువాతి తరం సౌండ్ బార్స్ గా లాంచ్ చేసింది

ఈ సౌండ్ బార్ లను నాణ్యమైన సౌండ్ అందించేలా రూపొందించినట్లు పోర్ట్రోనిక్స్ పేర్కొంది

Portronics: బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ తో సౌండ్ బార్స్ లాంచ్.!

కొత్త కొత్త మరియు వినూత్నమైన పోర్టబుల్ గాడ్జెట్‌ లను తీసుకొచ్చే బ్రాండ్ గా పేరొందిన Portronics బ్రాండ్,  కొత్త సౌండ్ బార్ లను విడుదల చేసింది. ఈసౌండ్ బార్ లను Sound Slick సిరీస్ నుండి తరువాతి తరం సౌండ్ బార్స్ గా లాంచ్ చేసింది. అవే Sound Slick IV మరియు Sound Slick V సౌండ్ బార్స్. ఈ సౌండ్ బార్ లను పవర్ ఫుల్ మరియు నాణ్యమైన సౌండ్ అందించేలా రూపొందించినట్లు పోర్ట్రోనిక్స్ పేర్కొంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ లను పేరుకు తగ్గట్టుగా సన్నని డిజైన్ తో మరియు ఇన్ బిల్ట్ ఉఫర్ తో అందించింది. ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 Portronics కొత్తగా లాంచ్ చేసిన ఈ రెండు సౌండ్ బార్స్ కూడా సన్నని మరియు సొగసైన డిజైన్ తో వస్తాయి. ఈ రెండు సౌండ్ బార్స్ స్క్రాచ్-రెసిస్టెంట్ కలిగిన శాండ్-గ్రెయిన్ ఫినిషింగ్‌తో వస్తాయి మరియు ప్రీమియం అనుభూతిని ఇస్తాయి. ముఖ్యంగా, వీటి స్లీక్ డిజైన్ కారణంగా చాలా ఈజీగా ఎక్కడైకైనా మీతో తీసుకెళ్లేలా ఉంటాయి. ఈ సౌండ్ బార్ లను యాడ్ చేయడం వలన మీ టీవీ సౌండ్ మరింత పవర్ ఫుల్ గా మరియు సినిమా థియేటర్ అనుభూతిని మీకు ఇంటిలోనే అందించగలదని కంపెనీ చెబుతోంది.

Sound Slick IV సౌండ్ బార్ రూ. 5,499 ధరతో ప్రకటించింది. ఈ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఇన్ బిల్ట్ ఉఫర్ లతో కలిపి టోటల్ 120W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇక Sound Slick V సౌండ్ బార్ విషయానికి వస్తే, ఇందులో ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ కేవలం రూ. 3,499 రూపాయల ధరతో లభిస్తుంది. ఇది రెండు 30W స్పీకర్లతో టోటల్ 60W సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది మరియు మీ బెడ్ రూమ్ కి సరిపోతుంది.

ఈ రెండు సౌండ్‌ బార్స్ 12 నెలల వారంటీతో వస్తాయి. ఈ సౌండ్ బార్ లను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ Portronics.com తో పాటుగా ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్ అయిన Amazon మరియు Flipkart వంటి ఆన్లైన్ స్టోర్స్ తో పాటుగా ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు.                          

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo