OnePlus Nord Buds 4: బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

వన్ ప్లస్ బడ్స్ 4 ఇయర్ బడ్స్ ను వన్ ప్లస్ ఈరోజు విడుదల చేసింది

ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ ను బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసింది

ఇది గొప్ప ఆడియో అనుభవాన్ని అందించేలా రూపొందించబడింది

OnePlus Nord Buds 4: వన్ ప్లస్ బడ్స్ 4 ఇయర్ బడ్స్ ను వన్ ప్లస్ ఈరోజు విడుదల చేసింది. ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ ను బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఇది మంచి సౌండ్ అందించే పేద స్పీకర్లు, నోయిస్ ను బాగా తగ్గించే గొప్ప నోయిస్ క్యాన్సిలేషన్ మరియు లాంగ్ బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చింది. వన్ ప్లస్ సరికొత్తగా అందించిన ఈ బడ్స్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూసేద్దామా.

OnePlus Nord Buds 4: ప్రైస్

వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 4 ఇయర్ బడ్స్ ను రూ. 3,299 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఆస్ట్రల్ టీల్ మరియు స్టెల్లార్ బ్లాక్ రెండు రంగుల్లో ఈ బడ్స్ ను లాంచ్ చేసింది. జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ బడ్స్ సేల్ స్టార్ట్ అవుతుంది. కంపెనీ అఫీషియల్ సైట్ మరియు అమెజాన్ నుంచి ఈ బడ్స్ సేల్ అవుతుంది.

OnePlus Nord Buds 4: ఫీచర్స్

వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 4 ట్రూ వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్ బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఇది గొప్ప ఆడియో అనుభవాన్ని అందించేలా రూపొందించబడింది. ఈ బడ్స్ లో టైటానియం కోటెడ్ 12.4mm డైనమిక్ స్పీకర్లు ,ఉంటాయి. ఇందులో అందించిన Bass Wave 2.0 టెక్నాలజీ, వన్ ప్లస్ 3D ఆడియో సపోర్ట్ మరియు Hi-Res వైర్లెస్ ఆడియో సర్టిఫికేషన్ తో మంచి సౌండ్ అందిస్తుంది.

ఈ ఇయర్ బడ్స్ అత్యాధునిక 52dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్‌ తో పాటు 5,500Hz వరకు అల్ట్రా వైడ్ నాయిస్ క్యాన్సిలేషన్ రేంజ్‌ను కలిగి ఉంటుంది. అంటే, బడ్స్ వెలుపల ఉండే అనవసర శబ్దాలని బాగా తగ్గించి మంచి సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ బడ్స్ Bluetooth 6.1 కనెక్టివిటీ, స్మార్ట్ బ్లూటూత్, గూగుల్ ఫాస్ట్ పెయిర్ , డ్యూయల్ డివైజ్ కనెక్షన్ మరియు లో లెటెన్సీ గేమింగ్ మోడ్ వంటి ప్రీమియం ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ బడ్స్ IP55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ తో వాస్తుంది.

ఇక ఈ బడ్స్ కలిగిన కాలింగ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బడ్స్ AI ఆధారిత నాయిస్ రిడక్షన్ టెక్నాలజీతో కూడిన 6 మైక్ సిస్టమ్‌ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ కారణంగా ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా స్పష్టమైన వాయిస్ కాల్స్ చేయవచ్చు. ఈ ఇయర్ బడ్స్ 45–54 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ అందించే లాంగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, కేవలం 10 నిమిషాల ఛార్జ్ చేస్తే గంటల ప్లే బ్యాక్ అందించే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఇందులో ఉంది.

Also Read: Nothing Phone 4b: అబ్బురపరిచే సరికొత్త డిజైన్ తో లాంచ్ అవుతోంది.!

వన్ ప్లస్ Hey Melody యాప్ సపోర్ట్ తో EQ కస్టమైజేషన్, ANC కంట్రోల్ మరియు టచ్ జెస్చర్స్ వంటి ఫీచర్లు మీకు అందుతాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :