Nokia వైర్డ్ మరియు బ్లూటూత్ బడ్స్ ను విడుదల చేసింది: ప్రారంభ ధర రూ.299

HIGHLIGHTS

Nokia ఇండియాలో రెండు కొత్త ఇయర్ ఫోన్ లను విడుదల చేసింది

వైర్డ్ ఇయర్ ఫోన్ మోడల్ పేరు Wired Buds WB 101

TWS మోడల్ పేరు Lite Earbuds BH-205

Nokia వైర్డ్ మరియు బ్లూటూత్ బడ్స్ ను విడుదల చేసింది: ప్రారంభ ధర రూ.299

HMD గ్లోబల్ యాజమాన్యంలోని Nokia ఇండియాలో రెండు కొత్త ఇయర్ ఫోన్ లను విడుదల చేసింది. ఒకటి వైర్డ్ ఇయర్ ఫోన్ కాగా మరొకటి బ్లూటూత్ ఇయర్ బడ్స్ ను అందించింది. ఈ ఇయర్ ఫోన్స్ ను లో వైర్డ్ ఇయర్ ఫోన్ మోడల్ పేరు Wired Buds WB 101 మరియు (TWS) బ్లూటూత్ ఇయర్ బడ్స్ TWS మోడల్ పేరు Lite Earbuds BH-205. ఈ రెండు ఇయర్ ఫోన్స్  nokia.com, రిటైల్ స్టోర్స్ మరియు e-కామర్స్ ప్లాట్ఫారాల పైన కూడా లభిస్తాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nokia Wired Buds WB 101 వైర్డ్ ఇయర్ ఫోన్స్ 10mm డ్రైవర్స్ తో రిచ్ బాస్ మరియు క్లియర్ సౌండ్ అందిస్తుందని నోకియా తెలిపింది. అంతేకాదు, ఇది పాసివ్ నోయిస్ ఐసోలేషన్ ఫీచర్ తో  కూడా వస్తుంది. కాలింగ్ కోసం ఇందులో డేడికేటెడ్ ఇన్ లైన్ మైక్ కూడా వుంది మరియు ఇది సిరి, అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్ కు కూడా మద్దతు ఇస్తుంది. ఈ ఇయర్ ఫోన్స్ నాలుగు అందమైన కలర్ ఆపాశం లలో లభిస్తుంది మరియు దీని ధర కేవలం రూ.299 రూపాయలు మాత్రమే.

Nokia Lite Earbuds BH-205                              

ఇక TWS బడ్స్ Lite Earbuds BH-205 విషయానికి వస్తే, ఇది 6nm డ్రైవర్స్ తో స్టూడియో-ట్యూన్డ్ సౌండ్ క్వాలిటీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ నోకియా బడ్స్ 36 గంటల ప్లే టైం ను అందించగలవని నోకియా తెలిపింది. వీటిలో, ఒక్కో బడ్ 40mAh ని కలిగి ఉండగా, ఛార్జింగ్ కేస్ 400mAh బిగ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ BH-205 బడ్స్ బ్లూటూత్ 5.0 సపోర్ట్ తో వస్తుంది మరియు చాలా సులభమైన టచ్ కమాండ్స్ తో వస్తుంది. ఇది చార్కోల్ మరియు పోలార్ సీ అనే రెండు కలర్ అప్షన్ లలో లభిస్తుంది మరియు అందమైన డిజైన్ తో వస్తుంది. ఈ TWS బడ్స్ ను నోకియా రూ.2,799 ధరతో ఆవిష్కరించింది.  

ఈ రెండు ఇయర్ ఫోన్స్  nokia.com, రిటైల్ స్టోర్స్ మరియు e-కామర్స్ ప్లాట్ఫారాల పైన కూడా లభిస్తాయి.               

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo