Noise Master Buds అమెజాన్ సేల్ చివరి రోజు అతి చవక ధరలో లభిస్తున్నాయి.!

HIGHLIGHTS

Noise Master Buds ను భారీ డిస్కౌంట్ ఆఫర్ తో చాలా చవక ధరలో సేల్ చేస్తోంది

ఈరోజు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ డీల్ లభిస్తుంది

ఈ బడ్స్ రెడ్ డాట్ విన్నర్ 2025 అవార్డు కూడా అందుకుంది

Noise Master Buds అమెజాన్ సేల్ చివరి రోజు అతి చవక ధరలో లభిస్తున్నాయి.!

Noise Master Buds ను అమెజాన్ ఇండియా ఈరోజు గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో చాలా చవక ధరలో సేల్ చేస్తోంది. నోయిస్ ఈ బడ్స్ ను BOSE సారధ్యంలో గొప్ప సౌండ్ తో అందించింది. ఈ బడ్స్ రెడ్ డాట్ విన్నర్ 2025 అవార్డు కూడా అందుకుంది. ఈ లేటెస్ట్ ప్రీమియం ఇయర్ బడ్స్ పై అమెజాన్ అందించిన డీల్స్ అండ్ ఆఫర్లు క్లియర్ గా తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Noise Master Buds: ఆఫర్లు

ప్రముఖ ఆడియో బ్రాండ్ గా పేరుమోసిన బోస్ భాగస్వామ్యంతో నోయిస్ కొత్తగా మాస్టర్ బడ్స్ సిరీస్ ను గత సంవత్సరం ప్రవేశపెట్టింది. ఈ సిరీస్ నుంచి మొదటి బడ్స్ ను రూ. 7,999 లాంచ్ ధరతో మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ బడ్స్ ను ఈరోజు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి రూ. 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ . 5,999 ఆఫర్ ధరతో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ బడ్స్ పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది.

Noise Master Buds amazon sale deal

బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే, ఈ బడ్స్ పై SBI క్రెడిట్ కార్డు 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్ తో ఈ నోయిస్ ప్రీమియం ఇయర్ బడ్స్ కేవలం రూ. 5,399 రూపాయల ఆఫర్ ధరలో అమెజాన్ నుంచి మీకు లభిస్తుంది. Buy From Here

Also Read: అండర్ రూ. 10,000 ధరలో బిగ్ QLED Smart Tv విడుదల చేసిన Blaupunkt

Noise Master Buds: ఫీచర్స్

నోయిస్ మాస్టర్ బడ్స్ 12.4mm PEEK + Titanium స్పీకర్ కలిగి ఉంటాయి. ఈ సెటప్ తో గొప్ప బాస్, మిడ్ రేంజ్ మరియు గొప్ప హై సౌండ్ బలంగా మరియు క్లీియర్‌గా వినిపించేలా చేస్తుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ Sound by Bose ట్యూన్డ్ ఇయర్ బడ్స్ గా నిలుస్తాయి మరియు గొప్ప ఆడియో సపోర్ట్‌ను కలిగి ఉంటాయి. ఈ నోయిస్ బడ్స్ అడాప్టివ్ Active Noise Cancellation (ANC) తో అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 49 dB వరకు శబ్దాన్ని తగ్గిస్తుంది.

ఈ బడ్స్ 6 మైక్ ఎన్విరాన్మెంటల్ నోయిస్ క్యాన్సిలేషన్ (ENC) సిస్టమ్‌తో వస్తుంది. దీని ద్వారా మీరు క్లియర్ అండ్ క్రిస్ప్ వాయిస్ కాల్స్ ను ఆస్వాదించవచ్చు. ఈ బడ్స్ డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీ, ఫైండ్ మై బడ్స్ మరియు స్పేషియల్ ఆడియో వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ సుమారు 44 గంటల ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. ఈ బడ్స్ LHDC 5.0 తో హై క్వాలిటీ సౌండ్ అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo