Noise Master Buds Open ఇయర్ బడ్స్ ను ప్రీమియం డిజైన్ మరియు BOSE సౌండ్ టెక్ తో ప్రకటించింది.!
Noise Master Buds Open ను ప్రీమియం డిజైన్ మరియు BOSE సౌండ్ టెక్ తో ప్రకటించింది
ఈ బడ్స్ కంప్లీట్ ఫీచర్స్ తో పాటు ప్రైస్ మరియు లాంచ్ ఆఫర్లు సైతం వెల్లడించింది
ఆకట్టుకునే గొప్ప లాంచ్ ఆఫర్స్ తో మార్కెట్ లో విడుదల చేస్తోంది
Noise Master Buds Open ఇయర్ బడ్స్ ను ప్రీమియం డిజైన్ మరియు BOSE సౌండ్ టెక్ తో ప్రకటించింది. ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ ను డిసెంబర్ 3వ తేదీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు నోయిస్ అనౌన్స్ చేసింది. అయితే, ఈ బడ్స్ లాంచ్ కంటే ముందే ఈ బడ్స్ కంప్లీట్ ఫీచర్స్ తో పాటు ప్రైస్ మరియు లాంచ్ ఆఫర్లు సైతం వెల్లడించింది. ఈ బడ్స్ ను ప్రీమియం ఫీచర్స్ తో మాత్రమే కాదు ఆకట్టుకునే గొప్ప లాంచ్ ఆఫర్స్ తో మార్కెట్ లో విడుదల చేస్తోంది.
Noise Master Buds Open : లాంచ్ అండ్ ప్రైస్
నోయిస్ మాస్టర్ అవార్డ్స్ ఓపెన్ ఇయర్ బర్డ్స్ ని డిసెంబర్ మూడో తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బడ్స్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించింది. ఈ బడ్స్ లాంచ్ తర్వాత కంపెనీ అఫీషియల్ సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ బడ్స్ ని రూ. 9,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేస్తునట్లు కంపెనీ తెలిపింది.
ఆఫర్లు
ఈ బడ్స్ పైన గొప్ప లాంచ్ ఆఫర్లను నోయిస్ అనౌన్స్ చేసింది. అవేమిటంటే, ఈ బడ్స్ పైన రూ. 2,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 1,000 రూపాయల HDFC బ్యాంక్ కార్డ్స్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ బడ్స్ కేవలం రూ. 6,999 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. దీనికోసం ఈ బడ్స్ ని రూ. 999 రూపాయలు చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవాలి. లాంచ్ తర్వాత మిగిలిన అమౌంట్ చెల్లించి ఈ బడ్స్ ని ఆఫర్ ధరలో అందుకోవచ్చు.
Noise Master Buds Open : ఫీచర్స్
ఈ లేటెస్ట్ నోయిస్ ఇయర్ బడ్స్ లో 10.8mm కస్టమ్ డైనమిక్ డ్రైవర్లను నోయిస్ అందించింది. ఆ అంతేకాదు, ప్రీమియం సౌండ్ కోసం Sound by Bose టెక్నాలజీతో పాటు ఆడియో అనుభవాన్ని మరింత గొప్పగా మార్చేందుకు ఆరు ప్రీసెట్ సౌండ్ మోడ్స్ తో Dynamic EQ ఫీచర్ ని ఇందులో అందించింది.
ఈ కొత్త ఇయర్ బడ్స్ ప్రత్యేకమైన C-Bridge ఓపెన్ ఇయర్ డిజైన్ తో లాంచ్ అయ్యింది. ఇది చెవి లోపలికి వెళ్లకుండా చెవి చుట్టూ అమర్చుకునేలా ఉంటాయి. ఒక్కో ఇయర్ బడ్ బరువు కేవలం 5.5 గ్రాములు మాత్రమే ఉంటుంది. కాలింగ్ సమయంలో మెరుగైన వాయిస్ క్లారిటీ కోసం ఇందులో 4-Mic ENC DNN టెక్నాలజీని నోయిస్ అందించింది.
కనెక్టివిటీ కోసం ఇందులో Bluetooth 5.4, డ్యూయల్ కనెక్టివిటీ మరియు గూగుల్ Fast Pair సపోర్ట్ అందించింది. ఈ బడ్స్ ఛార్జింగ్ కేసుతో కలిపి గరిష్ఠంగా 28 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని నోయిస్ తెలిపింది. ఈ బడ్స్ ను IPX4 రేటింగ్ వాటర్ రెసిస్టెన్స్ డ్యూరబిలిటీ తో లాంచ్ చేసింది.
Noise Audio యాప్ ద్వారా ఈక్వలైజర్ సెట్టింగ్స్, టచ్ కంట్రోల్స్ మరియు Spatial Audio వంటి ఫీచర్లను మీరు ఉపయోగించవచ్చు.