Moto Buds 2: డ్యూయల్ స్పీకర్ మరియు స్మార్ట్ ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

మోటోరోలా ఇండియన్ మార్కెట్లో కొత్త ఇయర్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది

Moto Buds 2 ను డ్యూయల్ స్పీకర్ మరియు స్మార్ట్ ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది

ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ సరికొత్త ట్రాన్సపరెంట్ డిజైన్ మరియు కాంపాక్ట్ సైజులో ఉంటుంది

Moto Buds 2: మోటోరోలా ఇండియన్ మార్కెట్లో కొత్త ఇయర్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ బడ్స్ ను డ్యూయల్ స్పీకర్ మరియు స్మార్ట్ ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ సరికొత్త ట్రాన్స్పరెంట్ డిజైన్ మరియు కాంపాక్ట్ సైజులో ఉంటుంది. ఈ అప్ కమింగ్ బడ్స్ కంప్లీట్ స్పెక్స్ అండ్ ఫీచర్స్ ఒక లుక్కేద్దామా.

Moto Buds 2: లాంచ్ డేట్

మోటో బడ్స్ 2 ఇయర్ బడ్స్ ను మే 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తుంది. అంటే, ఈ బడ్స్ ను రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేస్తుంది. ఈ బడ్స్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ చేస్తోంది. అంటే, లాంచ్ తర్వాత ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ అవుతుంది.

Moto Buds 2: ఫీచర్స్

మోటోరోలా ఈ కొత్త ఇయర్ బడ్స్ ను సరికొత్త కాంపాక్ట్ సైజులో ట్రాన్స్పరెంట్ డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ బడ్స్ డ్యూయల్ డ్రైవర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 11mm డైనమిక్ డ్రైవర్ మరియు 6mm మైక్రో ప్లానర్ మాగ్నెటిక్ డ్రైవర్ కలిగి ఉంటుంది. ఈ సెటప్ తో ఈ బడ్స్ జబర్దస్త్ బాస్ మరియు క్వాలిటీ సౌండ్ అందిస్తుందని మోటోరోలా తెలిపింది.

ఈ కలిగిన సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో Hi Res ఆడియో, LDAC మరియు 360 డిగ్రీ స్పేషియల్ ఆడియో ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా కాలింగ్ కోసం ఈ బడ్స్ లో 6 మైక్స్ సెటప్ కూడా ఉంటుంది. లీనమయ్యే సౌండ్ కోసం ఇందులో 55dB అడాప్టివ్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఇయర్ బడ్స్ మంచి కంఫర్ట్ ఫిట్ తో కూడా ఉంటుంది. ఇందులో స్మార్ట్ వేర్ డిటెక్షన్ వంటి స్మార్ట్ ఫీచర్స్ కూడా మోటోరోలా అందించింది. ఈ బడ్స్ ను కూడా ప్రీమియం పాంటోన్ క్యూరేటెడ్ కలర్స్ తో అందించింది. ఈ బడ్స్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 53 గంటల లాంగ్ ప్లే బ్యాక్ అందిస్తుంది.

Also Read: సేల్ చివరి సమయంలో iPhone 17 పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించిన ఫ్లిప్ కార్ట్.!

ఇక ఈ కొత్త మోటోరోలా ఇయర్ బడ్స్ కలిగిన ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బడ్స్ డ్యూయల్ డివైజ్ కనెక్షన్ మరియు ఆడియో షేర్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ ను IP54 రేటింగ్ వాటర్ రేపెళ్లేంటి డిజైన్ మరియు మోటో AI సపోర్ట్ తో కూడా లాంచ్ చేస్తుంది. ఈ ఇయర్ బడ్స్ బ్లూటూత్ 6.0 సపోర్ట్ మరియు మోటో బడ్స్ మ్యూజిక్ యాప్ సపోర్ట్ కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :