ఆడియో ప్రోడక్ట్స్ కంపెనీ MIVI కొత్త ఇయర్ బడ్స్ ని లాంచ్ చేయడానికి డేట్ అనౌన్స్ చేసింది. మివి DuePods A750 పేరుతో తీసుకు వస్తున్న ఈ ఇయర్ బడ్స్ ను నవంబర్ 24న మార్కెట్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సరికొత్త ఇయర్ బడ్స్ ను AI-ENC ఫీచర్ తో తీసుకు వస్తున్నట్లు కూడా వెల్లడించింది. ఈ కొత్త బడ్స్ యొక్క మరిన్ని ఫీచర్లను కూడా విడుదలకు ముందే మివి వెల్లడించింది. ఈ బడ్స్ కోసం అమేజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా కేటాయించింది మరియు ఇందులో ప్రోడక్ట్స్ ఫీచర్స్ ను కూడా లిస్ట్ చేసింది.
మివి కొత్త ఇయర్ బడ్స్ గురించి కంపెనీ చాలా విషయాలను లాంచ్ కంటే ముందుగానే వెల్లడించింది. మివి డ్యూపాడ్స్ ఎ750 ఇయర్ బడ్స్ ను ఎక్కువ సమయం ధరించిన ఇబ్బంది కలుగని విధంగా అధిక కంఫర్ట్ ఉండేలా డిజైన్ చేసినట్లు కంపెనీ చెబుతోంది. ఈ బడ్స్ కోసం హై ఎడ్ గ్లాస్ ఫినిష్ కలిగిన బాక్స్ ను మరియు ఆకర్షణీయంగా కనిపించే మెటాలిక్ ఫినిష్ బడ్స్ తో అందించినట్లు తెలిపింది.
ఈ కొత్త బడ్స్ బ్లూటూత్ 5.3 తో మల్టీ కనెక్టివిటీ ఫీచర్ ను కలిగి ఉంటాయి. 13mm స్పీకర్స్ తో ఈ బడ్స్ రిచ్ BASS అందిస్తాయని, ఎక్కువ సమయం ధరించడానికి వీలుగా కూడా ఉంటాయని కూడా గొప్పగా చెబుతోంది. ఈ మివి బడ్స్ గరిష్టంగా 55 గంటల కంటే ఎక్కువ ప్లేటైమ్ ను అందించగలవని మివి సూచించింది. ఈ బడ్స్ కేస్ బయట బ్యాటరీ నోటిఫికేషన్ లైట్ లను కూడా చూడవచ్చు.
Also Read : OpenAI: ChatGPT ప్రీమియం ఫీచర్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది.!
ఇక ఈ మివి డ్యూపాడ్స్ ఎ750 ఇయర్ బడ్స్ మరిన్ని ఫీచర్స్ గురించి చూస్తే, ఈ బడ్స్ AI-ENC ఫీచర్ తో క్లియర్ కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుందని కూడా కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఇది ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో 10 నిముషాల ఛార్జింగ్ తో 500 మినిట్స్ ప్లేటైమ్ అందించగలదని కూడా తెలిపింది మివి. అయితే, ఈ బడ్స్ ధర వివరాలు ఇంకా తెలియపరచ లేదు.