చవక ధరలో AI-ENC Earbuds వచ్చేశాయి.. ధర ఎంతంటే.!
మివి బ్రాండ్ కొత్త ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది
MIVI DuoPods A750 పేరుతో లాంచ్ చేసిన కొత్త బడ్స్
ఈ కొత్త బడ్స్ ను కూడా బడ్జెట్ ధరలోనే విడుదల చేసింది
ఇండియా మార్కెట్ లో బడ్జెట్ ధరలో తగిన ఫీచర్లతో ఇయర్ బడ్స్ అందిస్తున్న మివి బ్రాండ్, కొత్త ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది. MIVI DuoPods A750 పేరుతో లాంచ్ చేసిన ఈ కొత్త బడ్స్ ను కూడా బడ్జెట్ ధరలోనే విడుదల చేసింది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే చవక ధరలో ఈ Earbuds ను AI-ENC ఫీచర్ తో లాంచ్ చేసింది. ఈరోజే మర్కెట్ లో సరికొత్తగా విడుదలైన ఈ కొత్త మివి ఇయర్ బడ్స్ ధర మరియు ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం పదండి.
SurveyMIVI DuoPods A750 AI-ENC Earbuds
మివి డూపోడ్స్ ఎ750 ఇయర్ బడ్స్ ను రూ. 1,399 రూపాయల లాంచ్ ధరతో ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ బడ్స్ నవంబర్ 30 వ తేదీ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ బడ్స్ ను అమేజాన్ మరియు మివి వెబ్సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.
Also Read : Instagram Reels లో కొత్త ఫీచర్..ఇక యూజర్లకు పండగే.!
మివి డూపోడ్స్ ఎ750 ఇయర్ బడ్స్ ప్రత్యేకతలు
మివి డూపోడ్స్ ఎ750 ఇయర్ బడ్స్ ను మంచి డిజైన్ మరియు ఆకర్షణీయమైన ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ బడ్స్ మల్టి కనెక్టివిటీ ఫీచర్ తో వస్తుంది. ఈ మివి ఇయర్ బడ్స్ Bluetooth 5.3 వెర్షన్ తో వస్తుంది. ఈ బడ్స్ 13mm స్పీకర్స్ తో వస్తాయి మరియు రిచ్ బాస్ ను అంధిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ బడ్స్ లో అనువైన క్లియర్ కాలింగ్ కోసం ఎఐ-ENC ఫీచర్ తో వచ్చింది.
మివి డూపోడ్స్ ఎ750 ఇయర్ బడ్స్ యొక్క మరిన్ని ఫీచర్స్ చూస్తే, ఈ బడ్స్ 55 గంటల కంటే ఎక్కువ ప్లేటైమ్ అందిస్తుందని మివి తెలిపింది. ఈ బడ్స్ లో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా వుంది మరియు ఇది 10 నిముషాల ఛార్జ్ తో 500 మినిట్స్ ప్లేటైమ్ ను అందిస్తుందని మివి చెబుతోంది.
ఈ బడ్స్ ను ఇండియన్ యూజర్ల కోసం తగిన విధంగా తయారు చేసినట్లు కంపెనీ ఈ బడ్స్ గురించి గొప్పగా చెబుతోంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile