Mivi: మూడు కొత్త హెడ్ ఫోన్లను విడుదల చేసిన ఇండియన్ బ్రాండ్.!
ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Mivi
Mivi మూడు కొత్త హెడ్ ఫోన్ లను విడుదల చేసింది
రెండు Duopods కాగా మరొకటి నెక్‌బ్యాండ్
ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Mivi ఇండియాలో మూడు కొత్త హెడ్ ఫోన్ లను విడుదల చేసింది. వీటిలో, రెండు Duopods కాగా మరొకటి నెక్‌బ్యాండ్. ఈ మూడు ప్రోడక్ట్స్ ను కూడా మంచి సౌండ్ అందించ గల క్వాలిటీ స్పీకర్లతో తీసుకొచ్చినట్లు కంపెనీ చెబుతోంది. Duopods A550 మరియు F70 అమెజాన్ మరియు ఫ్లయ్ కార్ట్ లలో రూ.1,599 ధరకు లభిస్తాయి. అయితే, Collar Classic PRO నెక్‌బ్యాండ్ మాత్రం రూ.1,199 ధరకు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది. ఈ మూడు హెడ్ ఫోన్ల ప్రత్యేకతలు ఏమిటో చూద్దామా.
SurveyDuopods A550 మరియు F70 సౌండ్ క్వాలిటీని అందించే 12mm స్పీకర్లతో వస్తాయి. ఈ రెండు కూడా బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ తో వస్తాయి. అలాగే, ఈ రెండు పాడ్స్ కూడా టైప్-C ఛార్జింగ్ కేబుల్ తో కేవలం 1 గంటలో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ తో పూర్తి ఛార్జింగ్ చెయ్యగల టెక్ తో వస్తాయి. ఈ రెండు పాడ్స్ కూడా 50 గంటల ప్లే బ్యాక్ ని అందించ గలవు మరియు ENC నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో బయటి అవాంఛిత శబ్దాలను నిరోధిస్తాయి. ఇక ఈ Duopods A550 పాడ్స్ నలుపు, నీలం, పుదీనా ఆకుపచ్చ మరియు తెలుపు వంటి నాలుగు రంగులలో లభిస్తుండగా, Duopods F70 మాత్రం లేత గోధుమ రంగు, కోరల్, నీలం మరియు నలుపు వంటి రంగులలో వస్తుంది.
ఇక Collar Classic PRO నెక్‌బ్యాండ్ విషయానికి వస్తే, ఇది మరింత హెవీ బాస్ మరియు నాణ్యమైన సౌండ్ అందించేందుకు వీలుగా 13mm స్పీకర్లతో వస్తుంది. ఇందులో, పాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ మరియు బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ వంటి ఫీచర్లు వున్నాయి. ఈ నెక్‌బ్యాండ్ USB టైప్-C ఛార్జింగ్ కేబుల్‌తో వస్తుంది మరియు 250 గంటల స్టాండ్ బై టైం అందిస్తుంది. ఈ నెక్‌బ్యాండ్ నలుపు, నీలం, ఆకుపచ్చ, బూడిద మరియు ఎరుపు వంటి ఐదు అందమైన కలర్ అప్షన్లలో లభిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile