ఫ్లిప్ కార్ట్ Black Friday సేల్ నుంచి 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ అత్యల్ప ధరలో లభిస్తోంది.!

Highlights

దీపావళి పండుగ సేల్ ముగిసిన తర్వాత ఫ్లిప్ కార్ట్ మరో బిగ్ సేల్ ని అనౌన్స్ చేసింది

ఫ్లిప్ కార్ట్ Black Friday సేల్ మరియు ఈ సేల్ నుంచి భారీ డీల్స్ ని కూడా ఆఫర్ చేసింది

ఈ సేల్ నుంచి 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ అత్యల్ప ధరలో లభిస్తోంది

దీపావళి పండుగ సేల్ ముగిసిన తర్వాత ఫ్లిప్ కార్ట్ మరో బిగ్ సేల్ ని అనౌన్స్ చేసింది. అదే ఫ్లిప్ కార్ట్ Black Friday సేల్ మరియు ఈ సేల్ నుంచి భారీ డీల్స్ ని కూడా ఆఫర్ చేసింది. ఈ సేల్ నుంచి అందించిన చాలా బిగ్ డీల్స్ లో ఒక గొప్ప ఆఫర్ యూజర్లను ఆకట్టుకుంటుంది. అదేమిటంటే, ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ బోట్, ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ అత్యల్ప ధరలో లభిస్తోంది.

Black Friday Sale 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ డీల్

అద్భుతమైన డిటాచబుల్ అండ్ ప్రీమియం డిజైన్ తో బోట్ రీసెంట్ 7.1.4 ఛానల్ సెటప్ తో Aavante Prime X సౌండ్ బార్ ని రూ. 39,999 లాంచ్ ప్రైస్ తో విడుదల చేసింది. అయితే, ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి రూ. 17,500 బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 22,499 ప్రైస్ తో సేల్ అవుతోంది.

ఈ సేల్ నుంచి కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పైన రూ. 1,000 రూపాయల ప్రత్యేకమైన కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,250 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా ఫ్లిప్ కార్ట్ జత చేసింది. ఈ మూడు ఆఫర్లతో ఈ ప్రీమియం సౌండ్ బార్ ని కేవలం రూ. 20,249 రూపాయల ఆఫర్ ధరలో మీరు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి మీ సొంతం చేసుకోవచ్చు.

బోట్ 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఇది లేటెస్ట్ బోట్ ప్రీమియం సౌండ్ మరియు లుక్స్ పరంగా అండ్ ఫీచర్స్ పరంగా కూడా చాలా ప్రీమియం గా ఉంటుంది. ఈ సౌండ్ బార్ 7.1.4 డిటాచబుల్ సెటప్ తో వస్తుంది. అంటే, ఈ సౌండ్ బార్ తో వచ్చే బార్ లో జత చేసి మరియు విడదీసే విధంగా డిజైన్ చేయబడిన శాటిలైట్ స్పీకర్ సెటప్ ఉంటుంది. ఇందులో ఫ్రంట్ అండ్ అప్ ఫైరింగ్ స్పీకర్లు ఉంటాయి కాబట్టి మంచి రూమ్ ఫిల్లింగ్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ 7.1.4 డాల్బీ అట్మాస్ సౌండ్ సౌండ్ టెక్నాలజీ తో వస్తుంది మరియు టోటల్ 700W అవుట్ పుట్ సౌండ్ తో సినిమా థియేటర్ స్థాయి సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI Arc, USB, బ్లూటూత్ మరియు ఆప్టికల్ ఇన్ వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile