డీప్ బాస్ సౌండ్ తో రెండు కొత్త సౌండ్ బార్స్ విడుదల చేసిన JUST CORSECA

HIGHLIGHTS

UST CORSECA (JC) ఈరోజు ఇండియన్ మార్కెట్లో రెండు కొత్త సౌండ్ బార్ లను విడుదల చేసింది

హెవీ అండ్ డీప్ బాస్ అందించే సత్తా తో విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది

జస్ట్ కోర్సికా ఈరోజు Sonic Bar మరియు Shack Plus రెండు సౌండ్ బార్ లను అందించింది

డీప్ బాస్ సౌండ్ తో రెండు కొత్త సౌండ్ బార్స్ విడుదల చేసిన JUST CORSECA

ప్రముఖ గాడ్జెట్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ JUST CORSECA (JC) ఈరోజు ఇండియన్ మార్కెట్లో రెండు కొత్త సౌండ్ బార్ లను విడుదల చేసింది. ఈ రెండు బార్ లను కూడా బడ్జెట్ ధరలో హెవీ అండ్ డీప్ బాస్ అందించే సత్తా తో విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. జస్ట్ కోర్సికా సరికొత్తగా విడుదల చేసిన ఈ రెండు సౌండ్ బార్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

JUST CORSECA సౌండ్ బార్

జస్ట్ కోర్సికా ఈరోజు Sonic Bar మరియు Shack Plus రెండు సౌండ్ బార్ లను అందించింది. ఈ రెండు సౌండ్ బార్ లను కూడా బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది మరియు ఈ రెండు సౌండ్ బార్ లు కూడా ఈరోజు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు కంపెనీ వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకొచ్చింది. వీటిలో సోనిక్ బార్ ను రూ. 7,499 రూపాయల ధరలో మరియు షాక్ ప్లస్ సౌండ్ బార్ ను రూ. 6,499 ధరతో లాంచ్ చేసింది.

JUST CORSECA new soundbars

JUST CORSECA Shack Plus

ఈ సౌండ్ బార్ 2.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో మంచి డిజైన్ కలిగి 90W సౌండ్ అందించే బార్ మరియు 60W సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 160W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇది క్లియర్ వోకల్స్, డిటైల్డ్ మిడ్స్ మరియు హెవీ బాస్ సౌండ్ ఆఫర్ చేస్తుందని కంపెనీ ఈ సౌండ్ బార్ గురించి తెలిపింది. ఈ సౌండ్ బార్ HDMI ARC, Coaxial, USB, AUX, బ్లూటూత్, FM మరియు TF Card వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సపోర్ట్ తో ఇది స్మార్ట్ టీవీ, ప్రొజెక్టర్, PCs, స్మార్ట్ ఫోన్ మరియు మరిన్ని డివైజెస్ తో కనెక్ట్ చేసుకోవచ్చు.

Also Read: Redmi 15C: రెడ్ మీ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ టీజర్ విడుదల చేసిన షియోమీ.!

JUST CORSECA Sonic Bar

ఈ సౌండ్ బార్ కూడా 2.2 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో 120W సౌండ్ అందించే ప్రీమియం బార్ మరియు 80W డీప్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ సెటప్ ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 200W సౌండ్ అవుట్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI ARC, Coaxial, USB, AUX, USB మరియు TF మీడియా వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ అందించింది. ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ఫుల్ ఫంక్షన్ రిమోట్ కంట్రోల్ తో కూడా వస్తుంది. ఇది సూపర్ క్లియర్ సౌండ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo