flipkart revealed great deal on 5.2.4 Dolby Atmos soundbar before GOAT Sale
మరో పది రోజుల్లో ఫ్లిప్ కార్ట్ అతిపెద్ద సేల్ GOAT Sale ప్రారంభం అవుతుంది. అయితే, ఈ బిగ్ సేల్ ప్రారంభం కావడానికి ముందే 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై గ్రేట్ డీల్ ను ఫ్లిప్ కార్ట్ రివీల్ చేసింది. వాస్తవానికి, ఈ అప్ కమింగ్ సేల్ కంటే ముందు అందించిన బ్యాక్ టు క్యాంపస్ సేల్ నుంచి ఈ డీల్ అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ఈ రోజు మీకు మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది.
ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ జూలై 4వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఈ సేల్ కంటే ముందు ఫ్లిప్ కార్డ్ ప్రస్తుతం బ్యాక్ టు క్యాంపస్ సేల్ ని నిర్వహిస్తోంది. ఈ సేల్ ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉంది. ఈ లేటెస్ట్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ని అనౌన్స్ చేసింది.
డీల్ విషయానికి వస్తే, బోట్ యొక్క 5.2.4 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ మంచి ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఫస్ట్ ఈ సౌండ్ బార్ పై 77% భారీ డిస్కౌంట్ అందించిన ఫ్లిప్ కార్ట్ దీనిపై HDFC బ్యాంక్ రూ. 1,000 అదనపు డిస్కౌంట్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 15,999 ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఇది ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: Oppo Enco Air 5: కొత్త బడ్స్ ను స్మార్ట్ బ్లూటూత్ తో లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో తెలిపింది.!
ఇది బోట్ బ్రాండ్ నుంచి వచ్చిన 5.2.4 చానల్ సౌండ్ బార్ మరియు టోటల్ 625W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఇందులో ముందు మరియు పైన అప్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన ప్రీమియం బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ తో ఇంటిని ఫిల్ చేసే సౌండ్ అందిస్తుంది. ఇది ప్రీమియం డిజైన్ మరియు ఫినిష్ తో ఇంటికి మంచి డెకరేషన్ గా కూడా ఉంటుంది.
ఇక సౌండ్ ఫీచర్ విషయానికి వస్తే, ఈ బోట్ సౌండ్ బార్ ఇంట్లో అన్ని వైపులా సౌండ్ అందించే 5.2.4 డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్ తో వస్తుంది. ఇది మీ ఇంటిని సినిమా థియేటర్ గా మార్చేస్తుంది. ఇందులో ప్రత్యేకంగా అందించిన ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ ఉంటాయి మరియు ఇది బోట్ సిగ్నేచర్ సౌండ్ అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఇందులో HDMI eArc, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి.