Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై రూ. 12,000 భారీ డిస్కౌంట్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు నెవర్ బిఫోర్ ఆఫర్ ధరలో లభిస్తుంది

క్యాంపస్ సేల్ నుంచి ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ పై రూ. 12,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందించింది

ఈ సౌండ్ బార్ ప్రీమియం స్పీకర్ సెటప్ మరియు డాల్బీ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది

flipkart ofefrs rs 12000 discount on Zebronics 7.1.2 Dolby Atmos soundbar

ఇండియాలో భారీ అంచనాలతో 2025 లో జెబ్రోనిక్స్ లాంచ్ చేసిన Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు నెవర్ బిఫోర్ ఆఫర్ ధరలో లభిస్తుంది. ఎలాగంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ బ్యాక్ టు క్యాంపస్ సేల్ నుంచి ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ పై రూ. 12,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందించింది. ఇది జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ప్రీమియం స్పీకర్ సెటప్ మరియు డాల్బీ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన ఈ బిగ్ డీల్ పై ఓ లుక్కేద్దామా.

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్

జెబ్రోనిక్స్ BAR 9920 సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ రూ. 34,999 రూపాయల ధరతో మార్కెట్ లో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ బ్యాక్ టు క్యాంపస్ సేల్ నుంచి రూ. 11,000 భారీ డిస్కౌంట్ తో రూ. 23,999 ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఇది ఈ సౌండ్ బార్ విడుదలైన తర్వాత అత్యంత చవక ధరగా నిలుస్తుంది.

ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై మరో గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో 7.1.2 ఛానల్ తో వచ్చే ఏకైక డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ డీల్ గా ఇది నిలుస్తుంది.

Also Read: OnePlus Nord Buds 4: బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఇంట్లోనే సినిమా థియేటర్ స్థాయి ఆడియో అనుభూతిని అందించే విధంగా జెబ్రోనిక్స్ BAR 9920 ని అందించింది. ఇది ఒక ప్రీమియం 7.1.2 ఛానల్ డాల్బీ సౌండ్‌ బార్ మరియు 900W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. సినిమాలు, సంగీతం మరియు గేమింగ్ కోసం ఇది అద్భుతమైన క్వాలిటీ సౌండ్ ని అందిస్తుంది. ఈ సౌండ్ కలిగిన డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్ తో సౌండ్ ఇంట్లో అన్ని దిశల నుంచి వినిపించేలా చేస్తుంది. తద్వారా వినియోగదారులకు మరింత లీనమయ్యే సౌండ్ అనుభూతిని కలిగిస్తుంది. అదనంగా, 12 అంగుళాల వైర్‌ లెస్ సబ్‌ వూఫర్ బాగా డీప్ మరియు శక్తివంతమైన బాస్‌ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ సెటప్ లో స్పష్టమైన వోకల్స్, మిడ్‌లు మరియు ట్రెబుల్‌ అందించడానికి అవసరమైన 9 హై పర్ఫార్మెన్స్ స్పీకర్ లను అందించింది. ఈ స్పీకర్లు బార్ లో పెయిన్ సైడ్ లో మరియు ముందు భాగంలో ఉంటాయి. కనెక్టివిటీ పరంగా, ఈ సౌండ్ బార్ అత్యాధునిక ఫీచర్లతో వస్తుంది. ఇందులో HDMI eARC, ఆప్టికల్, USB, AUX మరియు Bluetooth 5.3 వంటి అనేక కనెక్టివిటీ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇది టీవీ, స్మార్ట్‌ ఫోన్, ల్యాప్‌ టాప్‌ మరియు ఇతర పరికరాలతో సులభంగా అనుసంధానం అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :