Flipkart offers big deals on Samsung dolby atmos soundbar from Republic Day sale
Samsung Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది ఫ్లిప్ కార్ట్. 3.1.2 ఛానల్ సెటప్ తో సాంసంగ్ లేటెస్ట్ గా అందించిన సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ తో 20 వేల కంటే తక్కువ ధరలో మీరు పొందవచ్చు. ఈ సౌండ్ బార్ ఫ్రంట్ అండ్ అప్ ఫైరింగ్ స్పీకర్లతో ఇంటి మొత్తాన్ని సౌండ్ తో నింపేస్తుంది. ఇది మాత్రమే కాదు, ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో ఈ సౌండ్ బార్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.
శాంసంగ్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన HW-Q600F/XL సౌండ్ బార్ మోడల్ పై ఫ్లిప్కార్ట్ ఈరోజు గొప్ప డీల్స్ అందించింది. అవేమిటంటే, ఈ సౌండ్ బార్ పై 43% డిస్కౌంట్ అందించి రూ. 20,990 ప్రైస్ తో ఆఫర్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 19,490 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది.
ఈ శాంసంగ్ లేటెస్ట్ సౌండ్ బార్ 3.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ ఉంటుంది. అంతేకాదు, ఈ శాంసంగ్ సౌండ్ బార్ సెటప్ లో పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ టోటల్ సౌండ్ బార్ సెటప్ తో 380W పవర్ ఫుల్ సౌండ్ ని ఆఫర్ చేస్తుంది. ఇది పూర్తిగా ట్రూ 3.1.2 సెటప్ తో గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు డీటీఎస్: X రెండు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ Q-Symphony, అడాప్టివ్ సౌండ్ మరియు స్పేస్ ఫిట్ సౌండ్ ప్రో వంటి అదనపు ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI in, HDMI ఔట్, Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉంది.