Dolby Atmos సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో 10 వేలకే లభిస్తున్నాయి.!
Dolby Atmos సౌండ్ బార్ ను బడ్జెట్ ధరలో కొనాలని చూసే వారికి గుడ్ న్యూస్
ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈరోజు మీ కోసం గొప్ప డీల్స్ అందుబాటులో ఉన్నాయి
ఈరోజు సేల్ చివరి రోజు కావడంతో ఫ్లిప్ కార్ట్ అనేక సౌండ్ బార్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది
Dolby Atmos సౌండ్ బార్ ను బడ్జెట్ ధరలో కొనాలని చూసే వారికి గుడ్ న్యూస్. ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్, ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈరోజు మీకోసం గొప్ప డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈరోజు సేల్ చివరి రోజు కావడంతో ఫ్లిప్ కార్ట్ అనేక సౌండ్ బార్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. వాటిలో ముఖ్యంగా బోట్ బ్రాండ్ నుంచి వచ్చిన డాల్బీ అట్మాస్ సౌండ్ బార్స్ పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఆఫర్ లతో లేటెస్ట్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్స్ కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తున్నాయి. ఈ సేల్ నుంచి అందుబాటులో ఉన్న బెస్ట్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డీల్స్ ను మీ కోసం ప్రత్యేకంగా ఈరోజు అందించాము.
Surveyఏమిటా Dolby Atmos సౌండ్ బార్ డీల్స్?
ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు ముగుస్తుంది. ఈ సేల్ చివరి రోజు కావడంతో బోట్ యొక్క లేటెస్ట్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. వాటిలో బోట్ Aavante Bar 4100DA మరియు Aavante Prime 5.1 5000DA రెండు సౌండ్ బార్స్ కూడా మంచి డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ వివరంగా చూద్దాం.

boAt Aavante Bar 4100DA
ఇది బోట్ అందించిన 3.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్. ఈరోజు ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 79% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 10,999 తో లిస్ట్ అయ్యింది మరియు HDFC క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,099 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ మీకు కేవలం రూ. 9,900 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ముందు నాలుగు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ 300W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI, USB, ఆప్టికల్, AUX, COAXIAL మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.
Also Read: Noise Master Buds అమెజాన్ సేల్ చివరి రోజు అతి చవక ధరలో లభిస్తున్నాయి.!
boAt Aavante Prime 5.1 5000DA
ఇది బోట్ తీసుకొచ్చిన 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ మరియు ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ అందించిన 69% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 11,499 ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ను HDFC క్రెడిట్ కార్డు తో తీసుకుంటే రూ. 1,149 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ బోట్ సౌండ్ బార్ కేవలం రూ. 10,349 రూపాయల అతి తక్కువ ధరలో ఈరోజు మీకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ముందు ఆరు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ సరౌండ్ స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ మరియు సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఇది గొప్ప సరౌండ్ తో పాటు 500W జబర్దస్త్ గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది. ఇందులో, HDMI, ఆప్టికల్, USB, COAXIAL, AUX మరియు బ్లూటూత్ వంటి పూర్తి కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.