boAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ GOAT Sale జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!
boAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ ను బోట్ సరికొత్తగా విడుదల చేసింది
సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ GOAT Sale నుంచి ఈరోజు జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది
సేల్ ఈ రోజుతో ముగిసింది కాబట్టి ఈ డీల్ ఈ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది
boAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ ను బోట్ సరికొత్తగా విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ GOAT Sale నుంచి ఈరోజు జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్ తో ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి ఈ డీల్ ఈ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
SurveyboAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్
బోట్ ఈ సౌండ్ బార్ లేటెస్ట్ గా మార్కెట్లో విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ రూ. 2,000 భారీ డిస్కౌంట్ అందుకుని రూ. 17,999 ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది. అలాగే, ఈ సౌండ్ బార్ ని Axis, IDFC మరియు HDFC క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 16,499 రూపాయల ధరకే లభిస్తుంది.
boAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్లు
ఈ బోట్ సౌండ్ బార్ 5.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో కంప్లీట్ స్పీకర్ సెటప్ ను బోట్ అందించింది. ఈ సౌండ్ బార్ నాలుగు స్పీకర్లు, రెండు ట్వీటర్లు మరియు పెయిన్ రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ BASS సౌండ్ అన్ధంచే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ బోట్ సౌండ్ బార్ టోటల్ 550 W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.

ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది స్లీక్ డిజైన్ మరియు ప్రీమియం ఫినిష్ తో ఇంటికి మరియు టీవీకి కూడా తగిన డెకరేషన్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్ v5.3, AUX, HDMI(e-ARC),ఆప్టికల్ మరియు USB తో సహా మల్టి కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Also Read: iQOO Z10R : బౌండ్ లెస్ AMOLED మరియు 32MP 4K సెల్ఫీ కెమెరాతో లాంచ్ అవుతోంది.!
ఈ సౌండ్ బార్ జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది మరియు సూపర్ సరౌండ్ సౌండ్ తో ఇంటిని సినిమా థియేటర్ గా మార్చే సత్తా కూడా కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
