flipkart goat sale offers never before huge discount on Samsung 5.1 Dolby soundbar
ఇది కదా ఆఫర్ అంటే, అని వద్దనుకున్నా మీ నోరు పలికే ఆఫర్ ఇది. నిజంగా ఈ ఆఫర్ చూస్తుంటే నమ్మశక్యం కానీ విధంగా ఉంది. ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన GOAT Sale 2026 ఈరోజు ప్రారంభమైంది. ఈ సేల్ నుంచి అసలు ఎవరు ఊహించని ఆఫర్లు అందించి కొనుగోలుదారుల మతి పోగొడుతోంది. ఇందుకు ఉదాహరణగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న డీల్ నిలుస్తుంది. అదేమిటంటే, కేవలం రూ. 12,250 రేటుకే Samsung 5.1 Dolby సౌండ్ బార్ ని మీ సొంతం చేసుకోండి.
ప్రీమియం ఫీచర్స్ తో శాంసంగ్ అందించిన 5.1 ఛానల్ సౌండ్ బార్ HW-B750F/XL ఈరోజు అన్ని ఆఫర్స్ తో కేవలం 12 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను 37% భారీ డిస్కౌంట్ తో రూ . 18,750 రూపాయల ధరలో లిస్ట్ చేసిన ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ పై రూ. 6,500 రూపాయల ICICI క్రెడిట్ కార్డ్ బిగ్ డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 12,250 రేటుకే మీకు లభిస్తుంది.
అంతేకాదు, SBI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ ను కొనే వ్ వారికి కూడా రూ. 5,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ రూ. 13,750 ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ సేల్ ధరలో ఈ సౌండ్ బార్ ఎదురు లేని సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది.
Also Read: Amazon Prime Day 2026: భారీ ఆఫర్స్ తో మొదలైన సేల్ టాప్ స్మార్ట్ ఫోన్ డీల్ పై ఒక లుక్కేద్దామా.!
ఈ శాంసంగ్ సౌండ్ బార్ 400W పవర్ అవుట్ పుట్ తో వచ్చే 5.1 ఛానల్ డాల్బీ సౌండ్ బార్. ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు మూడు మరియు సైడ్ లో రెండు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ మరియు డీప్ బాస్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ కలిగిన సెటప్ తో ఇంట్లోనే సినిమా థియేటర్ వంటి గొప్ప ఆడియో ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
ఇందులో, Dolby Digital 5.1 మరియు DTS Virtual సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ఉన్నాయి. శక్తివంతమైన వైర్‌లెస్ సబ్‌వూఫర్ డీప్ బాస్‌ను అందించగా, అడాప్టివ్ సౌండ్ ఫీచర్ కంటెంట్ ను బట్టి ఆడియోను ఆటోమేటిగ్గా ఆప్టిమైజ్ చేస్తుంది. Bass Boost Mode ద్వారా బాస్ ను సింగిల్ బటన్‌తో మరింతగా పెంచుకోవచ్చు. ప్రత్యేకంగా రూపొందించబడింది.
కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇందులో బ్లూటూత్, HDMI ARC, ఆప్టికల్ ఇన్ పుట్, USB ప్లేబ్యాక్ వంటి అనేక ఆప్షన్ లను కలిగి ఉంటుంది. ప్రీమియం డిజైన్, గోడకు అమర్చుకునే (Wall-Mount) సౌకర్యం, LED స్టేటస్ డిస్‌ప్లే మరియు సులభమైన సెటప్ ఈ సౌండ్ బార్ ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.