flipkart announced big discount on Sony Dolby Atmos soundbar
Sony Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ యొక్క డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ డిస్కౌంట్ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది తగిన డీల్ అవుతుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ కంటే ముందే ఈ భారీ సౌండ్ బార్ డీల్ ని అందించింది.
సోనీ 3.1 ఛానల్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ HT-G700 మోడల్ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ని ఈరోజు 48% భారీ డిస్కౌంట్ తో రూ. 24,990 రూపాయల ఆఫర్ ధరతో లిస్ట్ చేసిన ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ పై రూ. 2,500 రూపాయల SBI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. అంతేకాదు, రూ. 2,000 రూపాయల మల్టీ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు రూ. 22,490 ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది.
ఈ సోనీ సౌండ్ బార్ 3.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో చాలా ప్రీమియం డిజైన్ కలిగిన బార్ మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ తో వచ్చే బార్ లో మూడు పవర్ ఫుల్ స్పీకర్లు ఉంటాయి మరియు సబ్ ఉఫర్ కూడా డీప్ బాస్ అందించే ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 400W సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ మరియు DTS X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, సోనీ యొక్క ప్రత్యేకమైన వర్టికల్ సరౌండ్ ఇంజన్ మరియు S ఫోర్స్ ప్రో ఫ్రంట్ సరౌండ్ సౌండ్ వంటి అదనపు ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, 4K పాస్ ట్రూ, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Vivo T5 Pro 5G స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ సేల్ భారీ డీల్స్ అందుకోండి.!
ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.5 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ డీల్స్ తో మీకు మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. 20 వేల రూపాయల బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సరౌండ్ సౌండ్ బార్ కోసం చూసే యూజర్లు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.