CMF Buds 2 Series launched with 3 set of buds
CMF Buds 2 Series నుంచి మూడు కొత్త బడ్స్ లాంచ్ చేసింది. ఇందులో బడ్స్ 2a, బడ్స్ 2 మరియు బడ్స్ 2 ప్లస్ మూడు బడ్స్ ఉన్నాయి. ఈ మూడు బడ్స్ కూడా వాటి వాటి ఫీచర్స్ కు అనుగుణంగా ప్రైస్ కలిగి ఉంటాయి. ఈ మూడు బడ్స్ లో కూడా గొప్ప ANC సపోర్ట్ మరియు గొప్ప సౌండ్ అందించే స్పీకర్లు కలిగి ఉంటాయని నథింగ్ తెలిపింది.
సిఎంఎఫ్ బడ్స్ 2 సిరీస్ ను 2 వేల నుంచి 3వేల రూపాయల ప్రైస్ బడ్జెట్ లో అందించింది. ఈ మూడు బడ్స్ ధర వివరాలు ఇప్పుడు చూద్దాం. సిఎంఎఫ్ బడ్స్ 2a బేసిక్ బడ్స్ గా ఉంటాయి. బడ్స్ 2a ని రూ. 2,199 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో అందించింది. బడ్స్ 2 ను 2,699 ధరతో మరియు బడ్స్ 2 ప్లస్ ఇయర్ బడ్స్ ను రూ. 3,299 రూపాయల ధరతో లాంచ్ చేసింది.
ఈ సిరీస్ లో బడ్స్ 2a బేసిక్ వేరియంట్ గా ఉంటాయి. ఈ బడ్స్ లో 12.4mm బయోఫైబర్ స్పీకర్ లను అందించింది. ఈ బడ్స్ 42dB ANC (యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్) తో వస్తుంది. ఈ బడ్స్ మంచి కాల్ క్వాలిటీ కోసం HD మైక్ లను AI ENC సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ ANC Off లో టోటల్ 35 గంటల ప్లే టైం అందిస్తుంది. ఈ బడ్స్ IP 54 రేటింగ్ తో వస్తుంది.
బడ్స్ 2 ఈ సిరీస్ లో మిడిల్ ఆర్డర్ రోల్ నిర్వహిస్తుంది మరియు ఫీచర్స్ పరంగా 2a కంటే కొంచెం బెటర్ గా ఉంటుంది. ఈ బడ్స్ లో 11 mm PMI స్పీకర్లు అందించింది మరియు జతగా ఇందులో Dirac Opteo సౌండ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ బడ్స్ 48dB హైబ్రిడ్ ANC సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ 6HD మైక్స్ మరియు క్లియర్ వాయిస్ టెక్నాలజీ 3.0 సపోర్ట్ తో గొప్ప కాలింగ్ అందిస్తుంది. ఈ బడ్స్ IP55 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, దూల కనెక్షన్ మరియు స్పెటియల్ ఆడియో ఎఫెక్ట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: CMF Phone 2 Pro: సరికొత్తగా విడుదలైన CMF ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
ఈ బడ్స్ ఈ సిరీస్ లో టాప్ ఫీచర్స్ కలిగిన బడ్స్ గా నిలుస్తాయి. గొప్ప సౌండ్ అందించడానికి ఈ బడ్స్ లో N52 మ్యాగ్నెట్ కలిగిన LCP స్పీకర్ లను అందించింది. అంతేకాదు, ఈ బడ్స్ ప్యూర్ సౌండ్ అందించడానికి వీలుగా ఈ బడ్స్ లో Hi-Res LDAC సపోర్ట్ ను కూడా అందించింది. ఈ సిఎంఎఫ్ బడ్స్ స్పెటియల్ ఆడియో సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ 50dB హైబ్రిడ్ ANC మరియు 6 HD మైక్స్ తో ENC సపోర్ట్ కలిగి ఉంటుంది. అంటే, బెస్ట్ నోయిస్ క్యాన్సిలేషన్ అందించడమే కాకుండా గొప్ప కాలింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది. ఈ బడ్స్ టోటల్ 61 గంటల ప్లే టైమ్ అందిస్తుంది.